ఎస్బీఐ భారీ రిక్రూట్‌మెంట్: 8,653 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న బ్యాంక్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) జూనియర్ అసోసియేట్స్(కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) లేదా క్లర్క్ రిక్రూట్‌మెంట్ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
న్యూఢిల్లీ: నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న బ్యాంక్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) జూనియర్ అసోసియేట్స్(కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) లేదా క్లర్క్ రిక్రూట్‌మెంట్ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
క్లర్క్ కేడర్‌లో 8653 జూనియర్ అసోసియేట్స్(కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టుల భర్తీకి ఎస్బీఐ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 01.04.2019 నాటికి 20-28ఏళ్ల మధ్య ఉండాలి.(ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల గరిష్ట వయసు మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ. 150, ఇతరులకు 750.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ ఆన్‌లైన్ పరీక్షలు, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.
గుర్తుంచుకోవాల్సిన ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 12.04.2019
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 03.05.2019
ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష: జూన్ 2019
ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష: 10.08.2019.(తాత్కాలిక తేదీ)
మరిన్ని వివరాల కోసం https://bank.sbi/careers లేదా https://www.sbi.co.in/careers ను సంప్రదించవచ్చు.