Asianet News TeluguAsianet News Telugu

Bank Jobs: తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (TSCAB) స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారా. అయితే ఇది మీకు సువర్ణ అవకాశం ఉందని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ స్టేట్ కోపరేటివ్ బ్యాంక్ స్టాఫ్ అసిస్టెంట్స్ కోసం రిక్రూట్మెంట్ చేపట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 16 అక్టోబర్ 2022. 

Bank Jobs Telangana State Cooperative Apex Bank TSCAB Notification Released for Staff Assistant Posts
Author
First Published Oct 3, 2022, 1:35 PM IST

తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ TSCAB స్టాఫ్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను 28 సెప్టెంబర్ 2022న తన అధికారిక వెబ్‌సైట్ విడుదల చేసింది. స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల కోసం మొత్తం 13 ఖాళీలను ప్రకటించగా, దరఖాస్తు ఆన్‌లైన్ లింక్ 28 సెప్టెంబర్ 2022న యాక్టివేట్ అయ్యింది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 16 అక్టోబర్ 2022 గా నిర్ణయించారు. TSCAB స్టాఫ్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2022లో ఆసక్తి ఉన్న అభ్యర్థులు అర్హత ప్రమాణాలు, దరఖాస్తు రుసుము,  ముఖ్యమైన వాటి గురించి తెలుసుకోండి.

తెలంగాణలోని ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో  13 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్  మెయిన్ ఎగ్జామినేషన్ అనే రెండు స్థాయిలలో నిర్వహించబడే ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు. 

ముఖ్యమైన తేదీలు: తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ నోటిఫికేషన్‌తో పాటు స్టాఫ్ అసిస్టెంట్ పోస్ట్ కోసం TSCAB రిక్రూట్‌మెంట్ 2022కి సంబంధించిన అన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. 

ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రారంభ తేదీ: 28 సెప్టెంబర్ 2022
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 16 అక్టోబర్ 2022
ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తాత్కాలిక తేదీ: నవంబర్ 2022

పూర్తి నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేసి చదవండి..

దరఖాస్తు రుసుము
స్టాఫ్ అసిస్టెంట్ పోస్ట్ కోసం దరఖాస్తు రుసుము 
OC: రూ. 950/-
SC/ST/PC/Ex-Serviceman: రూ. 250/-

విద్యార్హతలు
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు, TSCAB రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు భాషలో ప్రావీణ్యం తప్పనిసరి

వయో పరిమితి
దరఖాస్తు చేయడానికి కనిష్ట వయస్సు 20 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు అంటే అభ్యర్థులు 02.09.1994న లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలి, కానీ 01.09.2002 కంటే తర్వాత కాదు.

ఎంపిక ప్రక్రియ
స్టాఫ్ అసిస్టెంట్ ఎంపిక విధానం రెండు ఆన్‌లైన్ పరీక్షలను నిర్వహిస్తారు..
ప్రిలిమినరీ పరీక్ష
మెయిన్స్ పరీక్ష

ఆన్ లైన్ ద్వారా ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి…
 

Follow Us:
Download App:
  • android
  • ios