జెనీవా: మరిన్ని మహామ్మారులను ఎదుర్కొనేందుకు సిద్దం కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ టెడ్రోస్ అథనామ్ కోరారు. ప్రజా ఆరోగ్యంపై నిధులను ఎక్కువగా ఖర్చు చేయాలని ఆయన ప్రపంచ దేశాలకు సూచించారు.

సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా ఒక్కటే చివరిది కాదన్నారు. 27.19 మిలియన్ ప్రజల కంటే ఎక్కువ మంది కరోనా బారినపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో 8,88,326 మంది మరణించారు. 

భవిష్యత్తులో ఇదే తరహాలో మరిన్ని మహామ్మారులు ప్రజలను కబళించే అవకాశాలు లేకపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో ఈ తరహా వైరస్ లు, వ్యాధులు వ్యాపిస్తే నివారణ కోసం ప్రస్తుతం  కంటే మరింత సిద్దంగా ఉండాలని కూడ సూచించింది  ప్రభుత్వ ఆరోగ్య సంస్థ.

కరోనాను నివారించేందుకు గాను ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు చేస్తున్నాయి. రష్యా దేశానికి చెందిన టీకా ఇప్పటికే మార్కెట్లోకి వచ్చింది. ఈ ఏడాది నవంబర్ నాటికి అమెరికాలో టీకాను విడుదల చేస్తామని అమెరికా ప్రకటించింది. మిగిలిన దేశాల్లో కూడ కరోనాపై వ్యాక్సిన్ ప్రయోగాలు చివరి దశల్లో ఉన్నాయి.