ప్రపంచాన్ని వణికిస్తున్న  కరోనా వైరస్ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం దర్యాప్తు నివేదిక ఇంకా విడుదల చేయలేదు. కానీ  ఈ విషయమై చైనా మాత్రం  ముందే ఓ ప్రకటన విడుదల చేసినట్టుగా అంతర్జాతీయ మీడియా ప్రకటించింది.


జెనీవా: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం దర్యాప్తు నివేదిక ఇంకా విడుదల చేయలేదు. కానీ ఈ విషయమై చైనా మాత్రం ముందే ఓ ప్రకటన విడుదల చేసినట్టుగా అంతర్జాతీయ మీడియా ప్రకటించింది.

కరోనా మూలాలను కనుగొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం చైనాలో పర్యటించిన సేకరించింది.గబ్బిలాలు, శీతలికరించిన ఆహారం ద్వారానే వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందని తెలిపింది. వుహాన్ ల్యాబ్ నుండి ఇది బయటకు వచ్చే ఆస్కారమే లేదని తేల్చి చెప్పింది.

అయితే డబ్ల్యు హెచ్ ఓ కూడా దర్యాప్తు నివేదికలో ఇదే విషయాలను పేర్కొన్నట్టుగా ప్రచారం సాగుతోంది.కరోనా మూలాలపై డబ్ల్యుహెచ్ఓ రూపొందించిన నివేదిక మూసాయిదాను ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ది అసోసియేటేడ్ ప్రెస్ సంపాదించింది. ఈ నివేదికలో ఉంది.

నిజానికి ఈ నివేదికను ఇప్పటికే విడుదల చేయాల్సి ఉంది. కరోనా మహామ్మారి వ్యాప్తికి చైనానే కారణమనే అపవాదును తొలగించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థపై డ్రాగన్ ఒత్తిడి తెస్తోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.తుది నివేదిక ఇలానే ఉంటుందా ఇలాగే ఉంటుందా అనే విషయమై ఇంకా స్సష్టత లేదు.

2019 డిసెంబర్ మాసంలో కరోనా కేసులు వెలుగు చూశాయి.ఈ వైరస్ ప్రపంచాన్ని ఇంకా గజగజలాడిస్తోంది. ఈ ఏడాది జనవరిలో వూహాన్ లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి బృందం పర్యటించింది.ప్రపంచ ఆరోగ్య సంస్థపై చైనా ఒత్తిడి తెచ్చిందా అనే అనుమానాలను పలు దేశాలు వ్యక్తం చేస్తున్నాయి.