రోజూ రెగ్యులర్ గా చేసే పనిలో కాస్త తేడా వస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది. అదిగో అలాంటి చిన్న సందేహమే ఆ వృద్ధురాలి ప్రాణాలు కాపాడింది. రెగ్యులర్ గా వర్డ్ పజిల్ ఆడి ఆ రిజల్ట్ కూతురికి క్రమం తప్పకుండా పంపే.. ఆమె ఆ రోజు అది చేయలేదు.. దీంతో...
చికాగో : Word puzzle ఆడితే కాలక్షేపం అవడమే కాదు.. మెదడుకు పదును పెట్టి తెలివితేటలు పెంచుతుంది. అయితే, ఇదే ఆట ఓ వృద్ధురాలి ప్రాణాలు సైతం కాపాడింది. ఓ Thug చెరనుంచి రక్షించింది.. ఎలాగంటే…
పద వినోదానికి సంబంధించి రకరకాల Game Appలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల ‘wordle’ అనే గేమ్ యాప్ అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఇందులో కొన్ని కొన్ని ఆంగ్ల అక్షరాలను ఇచ్చి వాటిలో ఐదు అక్షరాల పదాన్ని ఆరు ప్రయత్నాల్లో కనుగొనాలి. ఎన్ని తక్కువ ప్రయత్నాల్లో కనుగొంటే అంత ఎక్కువ స్కోర్ లభిస్తుంది. అయితే, Chicagoకు చెందిన 80 ఏళ్ల డెన్సెహోల్ట్ ఈ ఆటకు అలవాటు పడింది. ఒంటరిగా ఉంటున్న ఆమె.. ప్రతి రోజు రాత్రి ఈ గేమ్ ఆడి సాధించిన Score ను సియాటిల్ లో ఉన్న తన పెద్ద కుమార్తె మెరెడిత్ హోల్ట్ కాల్డ్ వెల్ కి పంపిస్తుంటుంది.
అయితే ఫిబ్రవరి 5న ఒక దుండగుడు హోల్ట్ ఇంట్లోకి చొరబడి ఆయుధాలతో బెదిరించి ఆమెను సెల్లార్లో బంధించాడు. దీంతో ఆ రాత్రి ‘వర్డిల్’ గేమ్ ఆడి స్కోరును తన కుమార్తెకు పంపించ లేకపోయింది. దీంతో కూతురుకి అనుమానం వచ్చి చికాగో పోలీసులకు సమాచారం అందించింది. మరుసటి రోజు ఉదయం పోలీసులు హోల్ట్ ఇంటికి వెళ్లి తనిఖీ చేస్తుండగా దుండగుడు ఎదురుపడ్డాడు.
కొన్ని గంటలపాటు శ్రమించి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సెల్లార్ లో బందీగా ఉన్న హోల్ట్ ను రక్షించారు. దుండగుడి 32 ఏళ్ల జేమ్స్ డేవిస్ గా గుర్తించిన పోలీసులు.. అతడికి మతిస్థిమితం లేనట్లు భావిస్తున్నారు. తనను బెదిరించాడని, ప్రాణాలతో బయటపడతానని అనుకోలేదని హోల్ట్ చెప్పుకొచ్చింది.
కాగా, ఫిబ్రవరి 8న అమెరికాలో.. గాంధీ విగ్రహాన్ని దుండగులు అవమానపరిచారు. New Yorkలో Mahatma Gandhi విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ నాయకులు ఖండించారు. ఈ చర్య ద్వేషనిర్మూలనకు ప్రయత్నించిన ఇద్దరు నాయకులు గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్‌లకు అగౌరవపరచడమే అని అన్నారు.
శనివారం (ఫిబ్రవరి 5, స్థానిక కాలమానం ప్రకారం) న్యూయార్క్ నగర పరిసరాల్లో మహాత్మా గాంధీ నిలువెత్తు కాంస్య విగ్రహం vandalised అయ్యింది. ఈ చర్యను భారత కాన్సులేట్ జనరల్ 'నీచమైన' చర్యగా తీవ్రంగా ఖండించింది. మాన్‌హట్టన్ యూనియన్ స్క్వేర్‌లో ఉన్న ఎనిమిది అడుగుల ఎత్తైన విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని న్యూయార్క్‌లోని కాన్సులేట్ తెలిపింది.
"హిందూ ధర్మాన్ని అనుసరించే ఆఫ్రికన్ అమెరికన్ అయిన నేను.. సమాజంలో ఎన్నో మంచి పెను మార్పులను ప్రేరేపించిన అహింసమిషన్‌ను ఇష్టపడతాను. అహింసామార్గాన్ని చేపట్టేలా మార్టిన్ లూథర్ కింగ్ ను ప్రేరేపించిన మహాత్మా గాంధీని ఇష్టపడతాను. ఆయన్ని ఎవరైనా అగౌరవపరిస్తే మనసు విచలితం అవుతుంది. వారు చేసిన సేవలే ప్రస్తుతం మన జీవితాల్ని ప్రభావితం చేస్తున్నాయి’ అని Vedic Friends Association అధ్యక్షుడు బలభద్ర భట్టాచార్య దాస (బెన్నీ టిల్‌మాన్) అన్నారు.
