ఈతరం యువతకు ఫోటోల పిచ్చి కాస్త ఎక్కువనే చెప్పాలి. ఏదైనా కొత్త ప్లేస్ కి వెళ్లినా... కొత్త డ్రస్ వేసుకున్నా...ఇలా కారణం ఏదైనా సెల్ఫీలు దిగి.. సోషల్ మీడియాలో పోస్టు చేసేస్తుంటారు.  వాటికి ఎన్ని లైకులు వచ్చాయని చూసుకొని మురిసిపోయేవారు కూడా కోకొల్లలు. ఈ సంగతి పక్కన పెడితే... కదిలే రైలులో ఫోటో షూట్ చేసుకొని ఓ యువతి నెటిజన్ల మనసు దోచేసింది.

ఇంతకీ మ్యాటరేంటంటే... న్యూ యార్క్ కి చెందిన  జెస్సికా జార్జ్ అనే యువతి ఇటీవల ట్రైన్ లో ప్రయాణిస్తోంది. బ్లాక్ కలర్ డ్రస్ లో చాలా అందంగా తయారైన ఆమె.. ప్రయాణికులు అందరూ చూస్తుండగా... వివిధ రకాలుగా ఫోజులు పెట్టి మరీ ఫోటోలు దిగింది. అందరి ముందు ఎలాంటి భయం, జంకు లేకుండా ఆమె ఫోటోలు దిగుతున్న తీరు  నచ్చిన ఓ వ్యక్తి దానినంతటినీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

ఆ వీడియో వైరల్ గా మారింది. ఆమె కాన్ఫిడెన్స్ కి నెటిజన్లు ఫిదా అయిపోయారు. చాలా అందంగా ఉందని.. డ్రస్ బాగుందని కొందరు కామెంట్స్ పెడుతుంటే.. మరికొందరు ఆమె కాన్ఫిడెన్స్ చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు. మొత్తానికి ఆమె ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆమె వీడియోని 8.7మిలియన్ల మంది వీక్షించారంటే అర్థం చేసుకోవచ్చు... ఎంతలా ఆమె జనాలను ఆకట్టుకుందో. కామెంట్స్ కూడా అదేవిధంగా వేల సంఖ్యలో వస్తుండటం విశేషం.