హైదరాబాద్: తీసుకునే ఆహార పదార్థాలే కాదు తినేటపుడు పరిసరాలు కూడా శుభ్రంగా వుండాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా టాయిలెట్స్ సమీపంలో ఆహార పదార్థాలను తినేందుకు ఎవ్వరూ ఇష్టపడరు. అలాంటిది ఓ పార్టీలో ఏకంగా టాయిలెట్ కమోడ్ లోనే డ్రింక్స్ మిక్స్ చేసి అతిథులకు అందించింది ఓ మహిళ. ఆమె కమోడ్ లో డ్రింక్స్ మిక్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేవలం ట్విట్టర్ లో ఏకంగా 6.6మిలియన్ల మంది ఈ వీడియోను చూశారు. ఈ వీడియో చూసినవారు వింత మనుషులు... వింత ఇష్టాలు... వింత పార్టీలు అంటూ నోరెళ్లబెట్టారు.