లండన్: 14 ఏళ్ల బాలుడితో లైంగిక సంబంధం పెట్టుకొన్న 22 ఏళ్ల యువతిని 'న్యూకాజిల్ క్రౌన్ కోర్టు'  మూడేళ్ల పాటు సామాజిక సేవ చేయాలని ఆదేశించింది. ఈ ఘటన ఇంగ్లాండ్ లోని న్యూకాజిల్ లో చోటు చేసుకొంది.లండన్ లో 16 ఏళ్లలోపు బాల బాలికలతో అంతకంటే పెద్ద వయస్సున్న వాళ్లు లైంగిక సంబంధాలు పెట్టుకొంటే పదేళ్ల నుండి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు.

న్యూకాజిల్ లో నివసిస్తున్న సోఫీ జాన్సన్ ఆన్ లైన్ లో 14 ఏళ్ల వయస్సున్న పాఠశాల విద్యార్ధితో స్నేహం చేసింది. ఈ స్నేహం లైంగిక సంబంధానికి దారి తీసింది.దీంతో ఆమెపై కేసు నమోదైంది. న్యూకాజిల్ క్రౌన్ కోర్టు ఈ కేసును విచారించింది. కొన్ని రోజుల్లో ఐదుసార్లు మాత్రమే ఆ బాలుడితో తాను లైంగిక సంబంధాన్ని కొనసాగించినట్టుగా ఆ యువతి కోర్టుకు తెలిపింది.

లైంగిక సంబంధం కొనసాగించిన బాలుడికి 16 ఏళ్లు ఉంటాయని తాను భావించినట్టుగా ఆమె తెలిపింది. కానీ అతడికి 14 ఏళ్లు ఉన్నాయని తెలుసుకొని అతడికి దూరమయ్యాయని ఆమె కోర్టుకు తెలిపింది.

సోఫీ కూడ లైంగిక సంబంధం కోసం బాలుడిపై ఎలాంటి ఒత్తిడి చేయలేదని న్యాయవాది పెన్నీ హాల్ వాదించారు. ఈ కేసులో బాలుడి వాంగ్మూలం కూడ సోఫికి వ్యతిరేకంగా లేదని ప్రాసిక్యూటర్ గామిన్ గాయిగ్ చెప్పారు. ఇప్పుడు ఆ బాలుడు సోఫీని కలుసుకోవాలనుకొంటున్నాడు. ఈ రెండేళ్ల కాలంలో సోఫీ ఎంతో శిక్షను అనుభవించిందన్నారు. ఇంట్లో నుండి బయటకు గెంటివేయబడింది. ఉద్యోగం పోయిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

బలవంతం లేకుండా ఇరువురు మనస్ఫూర్తిగా లైంగికంగా కలసినందున ఎలాంటి జైలు శిక్ష విధించడం లేదని మంగళావారం నాడు కోర్టు తీర్పు చెప్పింది.  అయితే మైనర్‌తోసంబంధం పెట్టుకున్నందుకు మూడేళ్లపాటు సామాజిక సేవ చేయాలని ఆదేశించింది.ఐదేళ్లపాటు సెక్స్‌ నేరస్థుల రిజిస్టర్‌లో సంతకం చేయాలని కోరింది.