Asianet News TeluguAsianet News Telugu

Omicron: దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ పంజా.. ఆ దేశంలో నాలుగో వేవ్

దక్షిణాఫ్రికాలో తొలిసారి ఒమిక్రాన్ వేరియంట్ కనిపించగానే ఖండాలకు అతీతంగా అన్ని దేశాలూ ప్రయాణ ఆంక్షలను అమలు చేశాయి. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఈ కేసులపై ఆందోళనలు నెలకొని ఉన్నాయి. కాగా, ఈ వేరియంట్ తొలిసారి వెలుగులోకి వచ్చిన దక్షిణాఫ్రికాలో పరిస్థితులు మరింత తీవ్రంగా ఉన్నాయి. ఈ దేశంలోని తొమ్మిది ప్రావిన్సుల్లో ఏడు ప్రావిన్సుల్లో కేసులు నమోదు అయ్యాయి. ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి జో ఫాహ్లా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 
 

with omicron south africa hit by fourth wave
Author
New Delhi, First Published Dec 3, 2021, 4:08 PM IST

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron) విజృంభిస్తున్నది. ఇప్పటికే 30 దేశాలకుపైగా వ్యాపించి విశ్వరూపం ప్రదర్శిస్తున్నది. ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంతో వ్యాపించే సామర్థ్యాన్ని కలిగి ఉండటంపై ప్రపంచమంతా ఆందోళనలో మునిగింది. కాగా, ఒమిక్రాన్ వేరియంట్ తొలిసారిగా కనిపించిన దక్షిణాఫ్రికాలో ఈ వేరియంట్ పంజా విసురుతున్నది. ఈ దేశంలోని మొత్తం 9 ప్రావిన్సులుంటే అందులో ఏడు ప్రావిన్సుల్లో ఈ వైరస్ వ్యాపించింది. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా నాలుగో వేవ్ వచ్చింది. దక్షిణాఫ్రికా ఆరోగ్య శాఖ మంత్రి జో ఫాహ్లా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ప్రస్తుతం South Africa దేశంలో నాలుగో వేవ్(Fourth Wave) నడుస్తున్నదని అన్నారు.

అయితే, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని కట్టడి చేయడానికి అత్యంత కఠిన ఆంక్షలేమీ విధించాలనే ఆలోచనలు చేయడం లేదని ఆరోగ్య శాఖ మంత్రి జో ఫ్లాహ్లా అన్నారు. అయితే, పౌరులందరూ కచ్చితంగా నిబంధనలు పాటించాలని, అర్హులైన వారందరూ టీకా వేసుకోవాలని తెలిపారు. అలాగైతే, ఒమిక్రాన్ వేరియంట్ కట్టడి కోసం కఠిన ఆంక్షలు విధించాల్సిన పని లేదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాగా, ఆ దేశ టాప్ సైంటిస్టు మిచెల్లె గ్రూమ్ మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికా దేశంల కనీవినీ ఎరుగని రీతిలో కేసులు నమోదు చేస్తున్నదని తెలిపారు. అత్యంత స్వల్ప సమయంలోనే ఒమిక్రాన్ కారణంగా అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయని వివరించారు. అంతేకాదు, ఈ వేరియంట్ ఒక ఏజ్ గ్రూపులో స్థిరంగా ఏమీ ఉండటం లేదని తెలిపారు.

Also Read: Omicron Variant: రాజకీయాలు వద్దు.. కొత్త వేరియంట్‌ను కట్టడి చేస్తాం: లోక్‌సభలో మన్సుఖ్ మాండవీయ

ఒమిక్రాన్ వ్యాప్తి మొదలైన తర్వాత చిన్న పిల్లల్లోనూ కేసులు పెరుగుతున్నాయని డాక్టర్ మిచెల్లె గ్రూమ్ వివరించారు. అందుకే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాము ఆస్పత్రి సౌకర్యాలపై ఫోకస్ పెట్టామని అన్నారు. చిన్న పిల్లల కేసులనూ దృష్టిలో పెట్టుకుని పిడియట్రిక్ బెడ్‌లను సిద్ధం చేస్తున్నామని వివరించారు. నాలుగేళ్ల లోపు పిల్లల్లో కేసులు పెరుగుతున్నాయని, హాస్పిటల్స్‌లో వారి చేరికలూ పెరుగుతున్నాయని తెలిపారు. అందుకోసమే బెడ్లనూ పెంచుతున్నట్టు అన్నారు.

మన దేశంలో రెండు Omicron కేసుల రిపోర్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ రెండు Karnatakaలోనే రిపోర్ట్ అయ్యాయి. ఒమిక్రాన్ సోకిన ఆ ఇద్దరిలో ఒకరు 66 ఏళ్ల విదేశీయుడు(Foreigner) ఉన్నారు. మరొకరు Bengaluruలో హెల్త్‌కేర్ వర్కర్‌గా పని చేస్తున్నారు. మన దేశంలో ఒమిక్రాన్ కేసులు రెండు ఉన్నాయని కేంద్రం తెలుపగానే చాలా మందిలో కలవరం మొదలైంది. అయితే, భయపడవద్దని చెబుతూనే అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని కేంద్రం చెప్పింది. అయితే, తాజాగా, మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఒమిక్రాన్ సోకిన ఆ 66 ఏళ్ల విదేశీయుడు దేశం విడిచి వెళ్లాడని తెలిసింది. ఔను.. ఆ విదేశీయుడు గత నెల 27వ తేదీనే మన దేశం విడిచి Dubai వెళ్లిపోయాడు. 

Also Read: Omicron : ఒమిక్రాన్ కు కొత్త చికిత్స, ఆమోదించిన బ్రిటన్.. భయపడాల్సిన పని లేదని భరోసా...

ఒమిక్రాన్ వేరియంట్ తొలిసారి వెలుగులోకి వచ్చిన దక్షిణాఫ్రికా వెళ్లి వచ్చినట్టుగా ట్రావెల్ హిస్టరీ ఉన్న 66 ఏళ్ల విదేశీయుడు గత నెల 20వ తేదీన భారత్‌కు వచ్చాడు. వచ్చిన వారం రోజులకే దుబాయ్‌కి వెళ్లిపోయాడు. బృహత్ బెంగళూరు మహానగర పాలికే(బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్) వివరాల ప్రకారం, దక్షిణాఫ్రికా నుంచి గత నెల 20వ తేదీన బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చాడు. నవంబర్ 23న ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో కరోనా టెస్టు చేసుకున్నాడు. అక్కడ రిజల్ట్ నెగెటివ్ అని వచ్చింది. ఆ తర్వాత నవంబర్ 27న దాదాపు అర్ధరాత్రి ఆయన హోటల్ వదిలి పెట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios