Asianet News TeluguAsianet News Telugu

Omicron : ఒమిక్రాన్ కు కొత్త చికిత్స, ఆమోదించిన బ్రిటన్.. భయపడాల్సిన పని లేదని భరోసా...

కరోనా సోకిన వారికి సోత్రో విమాబ్ ఇంజెక్షన్ తో యాంటీబాడీ చికిత్స చేయగా..వారిలో మంచి ఫలితాలు కనిపించాయంటున్నారు పరిశోధకులు. ఈ ఇంజెక్షన్ తో 79 శాతం మరణించే ప్రమాదం తగ్గినట్టు వెల్లడైంది. కోవిడ్-19కు సరికొత్త యాంటీబాడీ చికిత్సను బ్రిటన్లోని వైద్య నియంత్రణ సంస్థ ‘ద మెడిసిన్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ’ (ఎంహెచ్ఆర్ఏ) ఆమోదించింది. 

UK regulator approves 'sotrovimab' against omicron
Author
Hyderabad, First Published Dec 3, 2021, 12:20 PM IST

లండన్ : ప్రపంచానికి మొదలైన కొత్త టెన్షన్ ‘Omicron’ పై భయపడాల్సిన పనిలేదని.. కొత్త వేరియంట్ పై పనిచేసే ఔషధాన్ని గుర్తించినట్టు 
Britain వెల్లడించింది. ఈ మెడిసిన్ పేరు ‘సోట్రో విమాబ్’ అని తెలిపింది. ఫార్మా దిగ్గజం గ్లాక్సో స్మిత్ క్లైన్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న సోట్రోవిమాబ్ ఉపయోగించటానికి బ్రిటన్ ఆమోదం తెలిపింది. 

కరోనా సోకిన వారికి సోత్రో విమాబ్ ఇంజెక్షన్ తో యాంటీబాడీ చికిత్స చేయగా..వారిలో మంచి ఫలితాలు కనిపించాయంటున్నారు పరిశోధకులు. ఈ ఇంజెక్షన్ తో 79 శాతం మరణించే ప్రమాదం తగ్గినట్టు వెల్లడైంది.

కోవిడ్-19కు సరికొత్త యాంటీబాడీ చికిత్సను బ్రిటన్లోని వైద్య నియంత్రణ సంస్థ ‘ద మెడిసిన్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ’ (ఎంహెచ్ఆర్ఏ) ఆమోదించింది. ఇది ఒమిక్రాన్ లాంటి కొత్త వేరియంట్లపైనా సమర్ధంగా పని చేస్తుందని భావిస్తున్నారు.

Sotrovimab  అనే ఈ ఔషధాన్ని సింగిల్ monoclonal యాంటీ బాడీ లతో తయారు చేశారు. corona virus పైన ఉండే  కొమ్ము ప్రోటీన్ కు  అంటుకుంటుంది. తద్వారా అది మానవ కణాలలోకి ప్రవేశించకుండా నిలువరిస్తుంది. ఇది సురక్షితమైన ఔషధమని, తీవ్రస్థాయి అనారోగ్యం ముప్పున్న వారికి బాగా ఉపయోగపడుతుందని MHRA చీఫ్ ఎగ్జిక్యూటివ్ జూన్ రైనే తెలిపారు.

సోత్రో విమాబ్ ను Blood vessels ద్వారా 30 నిమిషాలపాటు ఇస్తారు. 12 ఏళ్లు పైబడిన వారికి ఇవ్వవచ్చు. ముప్పు అధికంగా ఉండే పెద్దల్లో వ్యాధి లక్షణాలతో కూడిన తలెత్తినప్పుడు.. వారు ఆసుపత్రిపాలు కాకుండా, మరణం బారిన పడకుండా 79 శాతం మేర ఈ  ఔషధం రక్షిస్తుందని క్లినికల్ పరీక్షల్లో వెల్లడయ్యింది. వ్యాధి లక్షణాలు బయట పడిన వెంటనే దీన్ని ఇస్తే మంచి ప్రయోజనం ఉంటుందని పరిశోధకులు తెలిపారు 

రెట్టింపు వేగంతో ఒమిక్రాన్ పంజా.. రంగంలోకి డ‌బ్ల్యూహెచ్‌వో

ఇదిలా ఉండగా, గ‌త నెల‌లో ద‌క్షిణాఫ్రికాలో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్ ఒమిక్రాన్ వేరియంట్ (Omicron variant) ప్ర‌స్తుతం అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌ద‌నీ, దీని వ్యాప్తి సైతం అధికంగా ఉంటుంద‌ని నిపుణుల అంచ‌నాల నేప‌థ్యంలో క‌ల‌వ‌రం మొద‌లైంది. సాధార‌ణ కోవిడ్ కేసుల కంటే రెట్టింపు వేగంతో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తుండ‌టంతో ప్ర‌పంచ దేశాలు దీనిపై ప‌రిశోధ‌న‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. 

ఈ నేప‌థ్యంలోనే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ  త‌మ నిపుణుల బృందాన్ని ద‌క్షిణాఫ్రికాకు పంపించింది.  అక్క‌డ పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు, ఈ వేరియంట్ వ్యాప్తి, చూపుతున్న ప్ర‌భావం, క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌పై ఈ బృందం ప‌రిశోధించ‌నుంద‌ని ఓ అధికారి వెల్ల‌డించారు. మొద‌ట‌గా క‌రోనా ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన ద‌క్షిణాఫ్రికాలో ప్ర‌స్తుతం ఈ ర‌కం కేసులు రోజురోజుకూ రెట్టింపు వేగంతో పెరుగుతున్నాయి. 

రోజువారీ గణాంకాలు గ‌మ‌నిస్తే.. తాజాగా 11,500 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. అంత‌కు ముందు రోజు 8,500 కేసులు వెలుగుచూశాయి. ఒక్క రోజులోనే రెట్టింపు కేసులు న‌మోదుకావ‌డంపై అక్క‌డి అధికార యంత్రాంగంతో పాటు ప్రపంచ దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి.  అయితే, ద‌క్షిణాఫ్రికాలో న‌వంబ‌ర్ నెల మ‌ధ్య‌లో రోజువారీ స‌గ‌టు కేసులు 200 నుంచి 300 వ‌ర‌కు న‌మోద‌య్యేవ‌ని అధికారులు వెల్ల‌డించారు. అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన క‌రోనా వేరియంట్ గా భావిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ ఇప్ప‌టికే ద‌క్షిణాప్రికా స‌హా 24కు పైగా దేశాల్లో Omicron వేరియంట్‌ను WHO గుర్తించింది.  

Follow Us:
Download App:
  • android
  • ios