వివాదాస్పదమైన వింటర్ ఒలంపిక్స్ టార్చ్ బేరర్ ఎంపిక పై చైనా తనను తాను సమర్థించుకుంది. కమాండర్ క్వి ఫాబావో ఎంపిక నిబంధనలకు అనుగుణంగా జరిగిందని పేర్కొంది.
గాల్వాన్ వ్యాలీ (galwan vally)లో భారత సైనికులతో సరిహద్దు ఘర్షణలో పాల్గొన్న పీఎల్ఏ (PLA) సైనికుడిని వింటర్ ఒలింపిక్స్‌కు టార్చ్ బేరర్ (torch bearer)గా రంగంలోకి ఎంపిక చేయడం వివాదస్పదంగా మారింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో చైనా (chaina) ఈ విషయంలో స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది. తన నిర్ణయాన్ని సోమవారం సమర్థించుకుంది. టార్చ్ బేరర్ ఎంపిక ప్రమాణాలకు అనుగుణంగానే ఉందని పేర్కొంది. ఈ ఈవెంట్ ను రాజకీయడం చేయడం మానుకోవాలని కోరింది.
జూన్ 2020లో తూర్పు లడఖ్‌లో (east ladak)ని గాల్వాన్ వ్యాలీలో ఇండియా సైనికులకు, చైనా సైనికులకు మధ్య జరిగిన పీఎల్ఏ (PLA) రెజిమెంటల్ కమాండర్ క్వి ఫాబావో (kwi phabhavo)కు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఆయన కొంత కాలం తరువాత కోలుకున్నారు. ఈ సారి చైనా బీజింగ్ లో వింటర్ ఒలంపిక్స్ (winter olymipics) నిర్వహిస్తున్నారు. దీని కోసం ముందుగా ప్రారంభ వేడుకలు నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ముందుగా టార్చ్ రిలే నిర్వహిస్తారు. అయితే ఈ రిలే కు టార్చ్ బేరర్ గా భారత్ ను రెచ్చ గొట్టేందుకు గాల్వాన్ లోయలో గాయపడి కోలుకున్న సైనికుడు క్వి ఫాబావోను చైనా ఎంపిక చేసింది. దీనిపై అన్ని దేశాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
టార్చ్ రిలేలో క్వి ఫాబావోని ఎంపిక చేయడం ఒలింపిక్స్ బ్రిడ్జిని నిర్మించాలనే చైనా అభిప్రాయానికి విరుద్ధంగా ఉందా అని బీజింగ్ (Beijing)లో జరిగిన మీడియా సమావేశంలో అడిగిన ప్రశ్నకు అక్కడి విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ సమాధానం ఇచ్చారు. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌లో టార్చ్ బేరర్లు విస్తృతంగా ప్రాతినిధ్యం వహిస్తారు. వారి ఎంపిక నిబంధనలకు అనుగుణంగానే జరిగిందని స్పష్టం చేశారు. దీనిని హేతుబద్దమైన పద్దతిలో చూడాలని తాము వివిధ పార్టీలను కోరుతున్నామని చెప్పారు. ఈ చర్య భారత్ సున్నితత్వాన్ని విస్మరించిందా అనే మరో ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. ‘‘ నేను ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే.. అందరూ టార్చ్ బేరర్ లను నిష్పక్షపాతంగా, హేతుబద్ధంగా వీక్షించాలని, రాజకీయ వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని మేము ఆశిస్తున్నాం’’ అని అన్నారు.
చైనా రెచ్చగొట్టే చర్యపై ఇటీవల న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ (arindham bagchi) స్పందించారు. కమాండర్‌ను గౌరవించే చైనా చర్యను విచారకరమైనదిగా ఆయన అభివర్ణించారు. చైనా ఒలింపిక్స్ వంటి ఈవెంట్‌ను రాజకీయం చేయడానికి ఎంచుకుందని అన్నారు. అమెరికా సెనెటర్స్ కూడా చైనా చర్యను ‘‘ అవమానకరం, ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే చర్య’’ గా పేర్కొన్నారు. రిపబ్లికన్ సెనేటర్ (republican senator), యుఎస్ సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ ర్యాంకింగ్ సభ్యుడు జిమ్ రిష్ (us senat forign relations committee ranking member jim rish) కూడా భారతదేశ సార్వభౌమాధికారానికి అమెరికా మద్దతు కొనసాగిస్తుందని తెలిపారు. మరో వైపు బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం వింటర్ ఒలంపిక్స్ ప్రారంభ ముగింపు వేడుకలకు హాజరుకావడం లేదని ప్రకటించింది. యూఎస్, యూకే కూడా ఈ గేమ్స్ ను బహిష్కరించాయి.
