అమెరికాలో కరోనా వైరస్ మృత్యు ఘంటికలు మోగిస్తోంది. అన్ని విషయాల్లో ప్రపచంతో పోటీపడి అగ్రస్థానంలో నిలిచిన అమెరికా కరోనా వైరస్ విషయంలోనూ ముందు ఉంది. అక్కడ నిమిషానికి 83మంది ప్రాణాలు కోల్పోతున్నారంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Also read కరోనా వైరస్: ఎట్టకేలకు డిశ్చార్జ్ అయిన బ్రిటన్ ప్రధాని జాన్సన్...

అమెరికాలో ఇప్పటి వరకు 5లక్షల మందికిపైగా కరోనా వైరస్ సోకింది. దాదాపు 20వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే.. వారిలో సగం మంది న్యూ యార్క్ కి చెందిన వారు కావడం గమనార్హం. ఆ న్యూయార్క్ నగరంలోనే ఎందుకు జనాలు పిట్టలు రాలిపోయినట్లుగా రాలిపోతున్నారు..? వైరస్ తో ప్రాణాలు కోల్పోయిన వారి శవాలు కుప్పలు తెప్పలుగా పడి ఉంటున్నాయి. కనీసం వారికి అంత్యక్రియలు చేయడానికి స్మశానాలు కూడా సరిపోకపోవడం గమనార్హం.

కేవలం న్యూయార్క్ లోనే ఎందుకిలా జరుగుతోందనడానికి చాలానే కారణాలు ఉన్నాయి. మొదటి కారణం..దీనికి కారణం ఎక్కువ జనాభా, టూరిస్టులు పెరిగిపోవడమేనని ఆ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ కువోమో అంటున్నారు. లాక్డౌన్ లేట్ గా అమలు చేయడమూ అందుకు ఆజ్యం పోసిందని చెబుతున్నారు.

ఏడాదికి సగటున దాదాపు 60 లక్షల మంది న్యూయార్క్‌ను సందర్శిస్తున్నారు. ప్రాణాంతక కరోనా వైరస్‌ గతేడాది డిసెంబరులో బయటపడినప్పటికీ అప్పటికీ ప్రపంచానికి దీని ఉనికి గురించి తెలియదు. ఈ మహమ్మారిని తీవ్రంగా పరిగణించే నాటికే కావాల్సినంత నష్టం జరిగిపోయింది. 

అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించే నాటికే న్యూయార్క్‌లో విదేశీయుల ద్వారా గానీ, విదేశాల నుంచి వచ్చిన స్వదేశీయుల నుంచి గానీ కరోనా విస్తరించి ఉండవచ్చు. ఈ క్రమంలోనే మార్చి 1న న్యూయార్క్‌లో తొలి కరోనా కేసు నమోదైంది.

విశ్లేషకుల అంచనా ప్రకారం న్యూయార్క్‌లో కరోనా మరణాలు పెరగడానికి ఈ మూడే ముఖ్య కారణాలు. ఇక ప్రపంచ జనాభాలో కేవలం 4.25 శాతం జనాభా కలిగి ఉన్న అమెరికాలో వేలాది మంది మృత్యువాత పడటం కలకలం రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో మరణించిన ప్రతీ ఐదుగురిలో ఒకరు అగ్రరాజ్యానికే చెందిన పౌరుడు ఉండటం గమనార్హం.