స్టెరాయిడ్ డెక్సామిథాసోన్ ఉత్పత్తిని పెంచాలి: డబ్ల్యుహెచ్ఓ

కరోనా రోగుల పాలిట సంజీవనిగా భావిస్తున్న స్టెరాయిడ్ డెక్సామిథాసోన్ ఉత్పత్తిని పెంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరింది.. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కరోనా వైరస్ రోగులకు ఈ ఔషధాన్ని వాడటం వల్ల మరణాల సంఖ్య తగ్గుతుందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. 

WHO urges dexamethasone boom for worst virus cases

జెనీవా: కరోనా రోగుల పాలిట సంజీవనిగా భావిస్తున్న స్టెరాయిడ్ డెక్సామిథాసోన్ ఉత్పత్తిని పెంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరింది.. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కరోనా వైరస్ రోగులకు ఈ ఔషధాన్ని వాడటం వల్ల మరణాల సంఖ్య తగ్గుతుందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. 

ఈ క్రమంలో డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మీడియాతో సోమవారం నాడు మీడియాతో మాట్లాడారు.  బ్రిటీష్‌ ట్రయల్‌లో ఈ ఔషధం మంచి ఫలితాన్ని ఇచ్చినట్లు నిరూపితం కావడంతో డెక్సామిథాసోన్‌కు ఇప్పటికే డిమాండ్ బాగా పెరిగింది. ఉత్పత్తిని వేగవంతం చేయాలని ఆయన సూచించారు.

also read:కరోనా వ్యాక్సిన్ తయారీలో చైనా ముందడుగు: మనుషులపై రెండో దశ ట్రయల్స్

 గత వారం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ బృందం నేతృత్వంలోని పరిశోధకులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 2 వేల మంది రోగులకు ఈ ఔ షధాన్ని ఇచ్చారు. ఇది మరణాల సంఖ్యను 35 శాతం తగ్గించిందని తేలిందన్నారు.

పరిశోధనలు ఇంకా ప్రాధమిక దశలోనే  ఉన్నప్పటికీ.. డెక్సమిథాసోన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కరోనా రోగుల ప్రాణాలను రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నదని నిరూపితమైందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే ఈ ఔషధం వాడటానికి అనుమతిస్తున్నామన్నారు.

డెక్సామిథాసోన్ 60 సంవత్సరాలుగా మార్కెట్లో ఉంది. సాధారణంగా ఈ ఔషధం మంటను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అయితే ప్రస్తుతం కరోనాతో తీవ్రమైన అనారోగ్యానికి గురైన రోగులకు మాత్రమే డెక్సామిథాసోన్ వాడాలని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. 

అంతేకాక తేలికపాటి కరోనా లక్షణాలు ఉన్న రోగులకు లేదా కోవిడ్-19‌ నివారణ కోసం ఈ  ఔషధం పనిచేస్తుందనడానికి ఎటువంటి ఆధారం లేదని చెప్పారు. అంతేకాదు హాని కలిగించే ప్రమాదం కూడా ఉంది అని టెడ్రోస్ హెచ్చరించారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios