జెనీవా: కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ను కనిపెట్టే వరకు మానవళికి ముప్పు ఉంటుందని  ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికార  ప్రతినిధి డాక్టర్ డేవిడ్ నాబర్రో అంచనా వేశారు.

ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ ను నివారించేందుకు వీలుగా వ్యాక్సిన్ ను కనిపెట్టేవరకు  ఈ వైరస్ విజృంభించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా కొంత కాలం తగ్గినట్టుగా కన్పించినా కూడ మళ్లీ విజృంభించే అవకాశాలు ఉన్నాయన్నారు. 

ఈ వైరస్ లక్షణాలు ఉన్నవారిని వెంటనే ఐసోలేషన్ కు తరలించాలని  డేవిడ్ నాబర్రో సూచించారు. కరోనా వైరస్ ప్రమాదం ఇప్పట్లో తగ్గదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది.

కరోనా వైరస్ ను నిరోధించేందుకు ఇంటికే పరిమితం కావడం ఉత్తమమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.అమెరికాతో పాటు కొన్ని దేశాల్లో కరోనా వైరస్ ప్రభావం  కొన్ని దేశాల్లో ఎక్కువగా ఉంది.అమెరికాతో పాటు కరోనా వైరస్ ప్రభావం తగ్గుతుందని  భావిస్తున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సూచనలు కొంత ఇబ్బందిగానే మారాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 18 లక్షల మందికి సోకిన కరోనా వైరస్ కారణంగా లక్షా పదివేల మంది మృతి చెందారు. అమెరికాలోనే 20 వేల మంది చనిపోయారు.