Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచంలో అత్యంత సంపన్నుడుగా బెర్నార్డ్ ఆర్నాల్ట్ .. ఇంతకీ ఆయన ఎవరు? ఏ ఏ వ్యాపారాలు చేస్తాడు?  

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో నెం.1 స్థానాన్ని ఫ్రెంచ్ బహుళజాతి సంస్థ లూయిస్ విట్టన్ సీఈఓ బెర్నార్డ్ ఆర్నాల్ట్ కైవసం చేసుకున్నాడు. ఫోర్బ్స్ ప్రకారం. డిసెంబర్ 2022 నాటికి అతని ఆస్తి విలువ $188.6 బిలియన్లు. అతని  వైన్, షాంపైన్, స్పిరిట్స్, ఫ్యాషన్, లెదర్ వస్తువులు, గడియారాలు, ఆభరణాలు, హోటళ్లు, పెర్ఫ్యూమ్‌లు,సౌందర్య సాధనాల వ్యాపారాలున్నాయి.అతనికి ప్రపంచవ్యాప్తంగా 5500 స్టోర్లు ఉన్నాయి.

Who is Bernard Arnault, worlds richest person
Author
First Published Dec 14, 2022, 5:04 PM IST

ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ .. ట్విట్టర్ అధినేత ఎలోన్ మస్క్‌ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచాడు. ఫోర్బ్స్ అత్యంత ధనవంతుల జాబితాలో  మొదటి స్థానంలో నిలిచాడు. సోమవారం నాడు ఎలోన్ మస్క్ యొక్క టెస్లా షేర్లు బాగా పడిపోయిన తర్వాత లూయిస్ విట్టన్ CEO బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఈ స్థానాన్ని భర్తీ చేశాడు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. ఆర్నాల్ట్ ఆస్తి విలువ 186.2 బిలియన్ డాలర్లు. గత కొనేండ్లుగా ఈ ఫ్రెంచ్ వ్యాపారవేత్త ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో మొదటి 10 స్థానాల్లో ఉన్నారు. అయితే.. అతని స్థానం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మెటా వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ కంటే దిగువన ఉండేది. 

ఇంతకీ బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఎవరు? 
 
లూయిస్ విట్టన్ మోయెట్ హెన్నెస్సీ (LVMH) ప్రపంచంలోని లగ్జరీ ఉత్పత్తులలో అతిపెద్ద పేర్లలో ఒకటి. ఈ బ్రాండ్ LVMS అని ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఈ కంపెనీకి సహ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ , చీఫ్ ఎగ్జిక్యూటివ్.  ఉత్తర ఫ్రాన్స్‌లోని రౌబైక్స్ లో మార్చి 5, 1949న బెర్నార్డ్ ఆర్నాల్ట్ జన్మించారు. అతని తండ్రి జీన్ లియోన్ ఆర్నాల్ట్. బెర్నార్డ్  ఎలైట్ ఇంజనీరింగ్ స్కూల్ ఎకోల్ పాలిటెక్నిక్ నుండి పట్టభద్రుడయ్యాడు.  

వ్యాపార కుటుంబంలో జన్మించిన ఆర్నాల్ట్ .. ఫెర్రేట్ సవినెల్ నిర్మాణ సంస్థలో ఇంజనీర్‌గా తన కేరీర్ ప్రారంభించాడు. అతని ప్రతిభ ఆధారంగా ప్రమోషన్లు పొందుతూ..1978 లో ఈ సంస్థ యొక్క ఛైర్మన్ గా ఎన్నికయ్యాడు. అతను 1984 వరకు ఈ సంస్థలో పని చేస్తూనే ఉన్నాడు. ఈ సమయంలో అతను ఫైనాన్షియర్ అగాచే హోల్డింగ్ కంపెనీ బ్లూప్రింట్‌ను సిద్ధం చేశాడు. ఆ తర్వాత ఫ్యాషన్ ప్రపంచంపై ఆయన ఆసక్తి రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది. తక్కువ వ్యవధిలో.. ఒక లగ్జరీ బ్రాండ్‌ను లాభదాయక సమ్మేళనంగా అభివృద్ధి చేశాడు. 

1984లో ఫ్రాన్స్‌కు తిరిగివచ్చి  ఆయన లగ్జరీ వస్తువుల మార్కెట్‌లోకి ప్రవేశించాడు. ఆర్నాల్డ్ బౌసాక్ సెయింట్-ఫ్రెరెస్‌ అనే ఒక వస్త్ర సమూహాన్ని కొనుగోలు చేశాడు. ఇది క్రిస్టియన్ డియోర్‌ను కూడా కలిగి ఉంది. నాలుగు సంవత్సరాల తరువాత.. అతను కంపెనీ యొక్క ఇతర వ్యాపారాలను విక్రయించాడు.  అతను కంపెనీ యొక్క చాలా ఇతర వ్యాపారాలను విడిచిపెట్టాడు. LVMH లో నియంత్రణ వాటాను కొనుగోలు చేశాడు. ఇందులో లూయిస్ విట్టన్, మోయెట్ హెన్నెస్సీ  అనే రెండు ప్రధాన కంపెనీలను విలీనం చేశాడు.

అనంతరం 1989లో.. బెర్నార్డ్ ఆర్నాల్ట్.. లూయిస్ విట్టన్  మెజారిటీ వాటాదారు అయ్యాడు. దీని కారణంగా ఇది ప్రపంచంలోని ప్రముఖ లగ్జరీ ఉత్పత్తుల సమూహంగా అవతరించింది. ఆర్నాల్ట్ 1989 నుండి కంపెనీ ప్రెసిడెంట్ , CEO గా వ్యవహరించారు. అదే సమయంలో అతను తన కుటుంబ హోల్డింగ్ కంపెనీ ఆర్నోలా SE డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ గా వ్యవహరించారు. అతనికి గ్రాండ్ ఆఫీసర్ డి లా లెజియన్ డి హానర్ , కమాండర్ డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెటర్స్ అనే గౌరవ బిరుదులు లభించాయి.

తను రెండుసార్లు వివాహం చేసుకున్నాడు, అతనికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. బెర్నార్డ్ యొక్క ఐదుగురు పిల్లలలో నలుగురు ఫ్రెడెరిక్, డెల్ఫిన్, ఆంటోయిన్ , అలెగ్జాండర్ లు తండ్రి వ్యాపారంలో  చేదోడువాడోగా ఉన్నారు. అతని తర్వాత వ్యాపారాన్ని ఎవరు స్వాధీనం చేసుకోవాలో ఆర్నాల్ట్ నిర్ణయిస్తాడు. ఇటీవల.. అతని రెండవ కుమారుడు ఆంటోయిన్‌కు అతని హోల్డింగ్ కంపెనీ కిష్తియాన్ డైర్ సేలో కీలక పదవిలో ఉన్నారు.  

ఫోర్బ్స్ ప్రకారం.. డిసెంబర్ 2022 నాటికి ఆర్నాల్ట్, అతని కుటుంబం నికర విలువ $188.6 బిలియన్లు. అతనికి వైన్, షాంపైన్, స్పిరిట్స్, ఫ్యాషన్ , లెదర్ వస్తువులు, గడియారాలు, ఆభరణాలు,హోటళ్లు,పెర్ఫ్యూమ్‌లు,సౌందర్య సాధనాల వ్యాపారాల్లో ఉన్నారు. క్రిస్టియన్ డియోర్‌లో బెర్నార్డ్ ఆర్నాల్ట్ 96.5 శాతం వాటాను కలిగి ఉన్నాడు. వారికి ప్రపంచవ్యాప్తంగా 5500 స్టోర్లు ఉన్నాయి.

ఆర్నాల్ట్ ఆర్ట్ కలెక్టర్‌గా కూడా గుర్తింపు పొందారు. ఆర్నాల్ట్ ఆర్ట్ సేకరణలో ఆధునిక, సమకాలీన చిత్రాలు ఉన్నాయి. ఇందులో పికాసో, ఆండీ వార్హోల్ రచనలు ఉన్నాయి. ఈ అభిరుచి కారణంగా.. ఆయన 2014లో పారిస్‌లోని బోయిస్ డి బౌలోగ్నేలో ఫౌండేషన్ లూయిస్ విట్టన్‌ను ప్రారంభించాడు. వేదిక ఫ్రాంక్ గెర్రీచే రూపొందించబడిన ఒక స్మారక ప్రైవేట్ ఆర్ట్ మ్యూజియం. ఆర్నాల్ట్ యొక్క సేకరణలు ప్రదర్శించబడతాయి.

బెర్నార్డ్ ఆర్నాల్ట్ కు ప్రస్తుతం 73ఏళ్లు. ప్రపంచ కుబేరులో జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ ..అతను చాలా అరుదుగా బహిరంగంగా కనిపిస్తాడు. సోషల్ మీడియాలో కూడా వ్యక్తిగతంగా యాక్టివ్‌గా ఉండడు.  బ్లూమ్‌బెర్గ్ వెల్త్ ఇండెక్స్ ప్రకారం.. ఆర్నాల్ట్ సంపదలో ఎక్కువ భాగం క్రిస్టియన్ డియోర్‌లో నుంచి వస్తుంది. ఇందులో అతని 97.5 శాతం వాటా ఉంది. ఈ కంపెనీ ఎల్‌విఎంహెచ్‌లో 41 శాతం వాటాను కలిగి ఉన్నారు. అతని కుటుంబానికి ఎల్‌విఎంహెచ్‌లో అదనంగా ఆరు శాతం వాటా ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios