బీజింగ్: కరోనా వైరస్ మూలాలను గుర్తించేందుకు గాను ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణుల బృందం ఈ నెల 14వ తేదీన  చైనాలో పర్యటించనుంది.

చైనాలోని వూహాన్ లో కరోనా వైరస్ తొలుత బయటపడింది. వూహాన్ లోని ఓ ల్యాబ్ లో ఈ వైరస్ ను చైనా సృష్టించిందని పలు దేశాలు ఆరోపణలు చేశాయి. దీంతో చైనా ప్రభుత్వే ఈ వైరస్ ను సృష్టించిందా లేదా అనే విషయాన్ని నిపుణుల బృందం తేల్చనుంది.

గత ఏడాది డిసెంబర్ మాసంలో వైరస్ ను గుర్తించారు. వూహాన్ లో వైరస్ మూలాలను నిపుణులు తెలుసుకొన్నారు. 10 మంది నిపుణుల బృందం వూహాన్ కు రానుంది.

వూహాన్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ లో కరోనా వైరస్ ను చైనా సృష్టించిందని ట్రంప్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ల్యాబ్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం సందర్శిస్తోందో లేదా  స్పష్టం చేయలేదు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం ఆలస్యంగా చైనాలో పర్యటించడానికి చైనా కారణమనే విమర్శలు కూడ లేకపోలేదు.