అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్, డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ కి మధ్య విభేదాలున్నాయని ఎప్పటినుండో కూడా చర్చ నడుస్తుంది. కానీ వాటిని బలపర్చడానికి సరైన ఆధారాలు మాత్రం లేవు. గురువారం రాత్రి జరిగిన ఒక సంఘటన మాత్రం వారి మధ్య పొరపచ్చాలు ఉన్నాయి అని చెప్పడానికి మరింత ఊతమిస్తుంది. 

రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ చివరి మీటింగ్ లో మెలానియా ట్రంప్, ఇవాంక ట్రంప్ ఇద్దరు ఎదురుపడ్డారు. ఇవాంకను చూసిన మెలానియా నవ్వుతు పలకరించినప్పటికీ... ఇవాంకా దాటేసి వెళ్ళిపోగానే, వెంటనే కన్నులు తిప్పేసుకుంది. ఆమె ముఖంలో పలికిన హావభావాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. 

ఇవాంకా ట్రంప్, డోనాల్డ్ ట్రంప్ మొదటి భార్య కూతురు కాగా మెలానియా ట్రంప్, అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి మూడవ భార్య అన్న విషయం విదితమే. 

ఆ వీడియోని, దీనికి వచ్చిన రియాక్షన్స్ ని మీరు కూడా ఒక లుక్కేయండి. 

మెలానియా మాజీ సలహాదారు, ఆమె స్నేహితురాలు విన్ స్టన్ వాల్కొఫ్ త్వరలో మెలానియా అండ్ మీ అనే ఒక పుస్తకాన్ని విడుదల చేయబోతున్నట్టు తెలిపింది. వివిధ రకాల మీడియా వర్గాల కథనం ప్రకారం ఇందులో ఎలా ఇవాంకా ట్రంప్ ను ఫోటోలకు దూరంగా ఉంచడానికి మెలానియా ప్రయత్నం చేసేదో ఇందులో పొందుపర్చనున్నారు. అంతే కాకుండా ఇవాంకా, ఆమె భర్త ఇద్దరు మెలానియా ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారో కూడా ఇందులో ఉండబోనున్నట్టు తెలియవస్తుంది.