తన భార్య కమలాహారిస్ ను చూస్తూ చాలా గర్వంగా ఉందంటూ ఆమె భర్త డౌగ్ ఎమ్హాఫ్‌ ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కమలాహ్యారీస్ ను గట్టిగా కౌగిలించుకున్న ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

యునైటెడ్ స్టేట్స్ వైస్ ప్రెసిడెంట్ అయిన మొదటి మహిళగా కమలా హారిస్  చరిత్ర సృష్టించారు. వైస్ ప్రెసిడెంట్ గా అధికారిక నివాసంలో అడుగుపెడుతున్న మొట్టమొదటి నల్లజాతీయురాలు, మొట్టమొదటి భారతీయ సంతతి మహిళ కమలా హారిస్. ఆమె భర్త డౌగ్ ఎమ్హాఫ్‌ను మొట్టమొదటి "సెకండ్ జెంటిల్మెన్". 

రెండు రోజుల క్రితం వెలువడిన అమెరికా ఎన్నికల ఫలితాల్లో అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బిడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలాహ్యారిస్ ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్హాఫ్ సోషల్ మీడియా వేదికగా భార్యను అభినందించారు. 

అటు వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన కమలా హ్యారిస్ కూడా భర్త ఫొటోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. 12 మిలియన్ల మంది తన ఫాలోవర్స్ కి తన భర్తను పరిచయం చేశారు. ఈ ఫొటోను షేర్ చేస్తూ ‘మీట్ ద లవ్ ఆఫ్ మై లైఫ్. @ డగ్లస్ ఎమ్హాఫ్" అని పోస్ట్ చేశారు. 

దీనికి ఎమ్హాఫ్  "లవ్ యు మేడమ్ వైస్ ప్రెసిడెంట్ - ఎలెక్టెడ్" అంటూ రీ ట్వీట్ చేశారు. కమలా హారిస్, డగ్లస్ ఎమ్హాఫ్ 2014 లో వివాహం చేసుకున్నారు. ఇది ఆమెకు మొదటి వివాహం కాగా ఎమ్హాఫ్ కు రెండోది. ఇద్దరి వయసూ 56 యేళ్లే. ఇద్దరి కామన్ స్నేహితులు ఏర్పాటు చేసిన బ్లైండ్ డేట్‌లో కలుసుకున్నప్పుడు మొదట చూపులోనే ప్రేమలో పడిపోయాం అని ఎమ్హాఫ్ చెప్పుకొచ్చారు. 

ఎమ్హాఫ్ మీడియా, స్టోర్స్ , ఎంటర్టైన్మెంట్ లాలో స్పెషలైజేషన్ చేశారు. కమలా హ్యారీస్ ప్రచారంలో ఎమ్హాఫ్ ను సీక్రెట్ వెపన్ గా పేరొందాడు. సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేకంగా చాలా ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. 

బ్రూక్లిన్‌లో పుట్టి న్యూజెర్సీలో పెరిగిన ఎమ్హాఫ్ కు జువిష్ సమ్మర్ క్యాంప్ లో  అథ్లెటిక్ అవార్డులు గెలుచుకున్న సంతోషకరమైన జ్ఞాపకాలు ఉన్నాయని చెబుతారు. ఎమ్హాఫ్ మరో ప్రత్యేకత ఏంటంటే అమెరికా మొదటి లేదా రెండో ఫ్యామిలీగా మారిన మొట్ట మొదటి జువిష్ ఎమ్హాఫ్.