ఇంట్లో కూడా మాస్క్ ధరించాల్సిందేనా..?

బీఎమ్‌జే గ్లోబల్‌  హెల్త్ ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది. ఇంట్లో కూడా మాస్క్ ధరించినప్పుడు మనతో పాటు మన కుటుంబ సభ్యులను కూడా మహమ్మారి బారి నుంచి కాపాడుకోగలమంటుంది ఈ నివేదిక. 

Wearing masks at home can limit spread: Study

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. ఇప్పటి వరకు ఈ వైరస్ కి మందు కనిపెట్టలేదు. దీంతో.. ఈ వైరస్ కి ఇప్పట్లో అడ్డుకట్ట వేసేవారు కూడా కనపడటం లేదు. దీంతో విపరీతంగా విజృంభిస్తోంది. అయితే.. బయటకు వెళ్లిన ప్రతిసారి వైరస్ సోకకుండా ఉండేందుకు ముందుస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మాస్క్ లు ధరిండం, సానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. అయితే.. ఇక నుంచి ఇంట్లో కూడా మాస్క్ ధరించాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. బీఎమ్‌జే గ్లోబల్‌  హెల్త్ ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది. ఇంట్లో కూడా మాస్క్ ధరించినప్పుడు మనతో పాటు మన కుటుంబ సభ్యులను కూడా మహమ్మారి బారి నుంచి కాపాడుకోగలమంటుంది ఈ నివేదిక. 

ఇంట్లో ఎవరికి కరోనా సోకక ముందు నుంచే మాస్క్‌ ధరిస్తే.. వైరస్‌ వ్యాప్తిని 79 శాతం.. ప్రతి రోజు ఇంటిని బ్లీచ్‌, ఇతర క్రిమిసంహారకాలతో శుభ్రపరిస్తే.. 77 శాతం వైరస్‌ వ్యాప్తిని నిరోధించగమలని సదరు నివేదిక వెల్లడించింది. కుటుంబ సభ్యుల మధ్య కనీసం ఒక మీటరు సామాజిక దూరం తప్పనిసరి అని ఈ నివేదిక తెలిపింది. 

ఈ నివేదిక తెలిపిన దాని ప్రకారం చైనాలో ఫిబ్రవరిలో నమోదయిన క్లస్టర్‌ కేసులు సూపర్‌ మార్కెట్‌, పాఠశాలల నుంచి వచ్చినవి కావని.. కుటుంబాలలోనే వ్యాప్తి చెందిన కేసులని తెలిపింది. దాదాపు 1000 క్లస్టర్‌ కేసులను పరిశీలించినప్పుడు వాటిలో 83 శాతం కేసులు కుంటుబ సమూహాలుగా గుర్తించబడ్డాయని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వైరస్ నిపుణుడు వు జున్యూ తెలిపారు. 

బయటకు వెళ్లినప్పుడు సామాజిక దూరం పాటించడం.. మాస్క్‌ ధరించం వల్ల వైరస్‌ వ్యాప్తిని నిరోధించగలమన్నారు వూ జున్యూ. అయితే ఇంటిలో  కూడా మాస్క్‌ ప్రభావవంతంగా ఉంటుందని నిరూపించేందుకు చాలా తక్కువ ఆధారాలు ఉన్నాయని ఆయన తెలిపారు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios