Viral Video: వామ్మో.. విమాన భోజనంలో పాము తల.. వైరల్ వీడియో.. !
Viral Video: టర్కీ విమానయాన సంస్థకు చెందిన ఫ్లైట్ అటెండెంట్ ఇటీవల విమానంలోని భోజనంలో తెగిపడిన పాము తలని గుర్తించి భయపడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.
Snake Head Found In Plane Meal: ఓ విమానయాన సంస్థ తన ఫ్లైట్ లో అందించిన భోజనాకి సంబంధించిన ఓ షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వైరల్ వీడియో అందరినీ షాక్ కు గురిచేయడంతో పాటు కొంత భయాన్ని సైతం కలుగుజేస్తోంది. ఎండుకంటే ఫ్లైట్ అటెండెంట్ తనకు అందించిన భోజనంలో ఒక పాము తలను గుర్తించాడు. బంగాల దుంప, ఆకుకూరలతో కూడిన ఆ వంటకంలో పాము తలను చూసిన ఫ్లైట్ అటెండెంట్ భయపడిపోయాడు.
వివరాల్లోకెళ్తే.. టర్కీకి చెందిన విమానయాన సంస్థకు చెందిన ఫ్లైట్ అటెండెంట్ ఇటీవల విమానంలోని భోజనంలో తెగిపడిన పాము తలని గుర్తించాడు. వన్ మైల్ ఎట్ ఎ టైమ్, ది ఇండిపెండెంట్ నివేదించిన ప్రకారం.. జూలై 21న టర్కీలోని అంకారా నుండి జర్మనీలోని డ్యూసెల్‌డార్ఫ్‌కు వెళ్తున్న SunExpress విమానంలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. క్యాబిన్ సిబ్బంది వారు తమ సిబ్బంది భోజనం తింటున్నట్లు పేర్కొన్నారు. బంగాళదుంపలు, కూరగాయలతో కూడిన భోజనం మధ్యలో ఒక చిన్న పాము తల ను గుర్తించారు. ట్విటర్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో ఒక చిన్న పాము తల భాగం ఫుడ్ ట్రే మధ్యలో ఉన్నట్టు కనిపించింది.
ఈ భయానక ఘటనపై విమానయాన సంస్థ వెంటనే స్పందించింది. అలాగే, ఫుడ్ అందజేస్తున్న సంస్థతో కార్యకలాపాలు నిలిపివేసినట్టు తెలిపింది. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. సన్ ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి టర్కిష్ ప్రెస్‌తో మాట్లాడుతూ ఈ సంఘటన పూర్తిగా ఆమోదయోగ్యం కాదు అని అన్నారు. విమానయాన సంస్థ ప్రశ్నార్థకమైన ఆహార సరఫరాదారుతో తన ఒప్పందాన్ని పాజ్ చేసిందని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కూడా ప్రారంభించబడిందని తెలిపారు. "విమానయాన పరిశ్రమలో 30 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉన్నందున, మా విమానంలో మా అతిథులకు మేము అందించే సేవలు అత్యధిక నాణ్యతతో ఉంటాయి. మా అతిథులు, ఉద్యోగులు ఇద్దరూ సౌకర్యవంతమైన, సురక్షితమైన విమాన అనుభవాన్ని కలిగి ఉండటమే మా ప్రధాన ప్రాధాన్యత" అని సదరు ఎయిర్ లైన్స్ సంస్థ పేర్కొన్నట్టు ఇండిపెండెంట్ నివేదించింది.
"విమానంలో ఆహార సేవకు సంబంధించి పత్రికల్లో వచ్చిన ఆరోపణలు, సంబంధిత ఘటన ఫొటోలు, వీడియోలు పూర్తిగా ఆమోదయోగ్యం కాదని మేము మీకు తెలియజేయాలనుకుంటున్నాము. ఈ అంశంపై వివరణాత్మక దర్యాప్తు ప్రారంభించబడింది" అని ఎయిర్ లైన్స్ సంస్థ పేర్కొంది. మరోవైపు, భోజనాన్ని సరఫరా చేసిన క్యాటరింగ్ కంపెనీ.. తమపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేసింది. తాము అందించిన భోజనంలో పాముతల వచ్చిందనే వార్తలను ఖండించింది. Sancak Inflight Service నివేదిక ప్రకారం "వంట చేసేటప్పుడు ఆహారంలో ఉండే విదేశీ వస్తువులను ఏదీ అందించలేదు. క్యాటరింగ్ కంపెనీ తన భోజనం 280 డిగ్రీల సెల్సియస్‌లో వండుతారు కాబట్టి, సాపేక్షంగా తాజాగా కనిపించే పాము తల కనిపించడంపై దర్యాప్తు జరుపుతున్నామని" తెలిపింది.