Asianet News TeluguAsianet News Telugu

ఖలీస్తానీ రెఫరెండంలో ఘర్షణ: అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోలో కొట్టుకున్న వైరివర్గాలు

ఖలీస్తానీ ప్రత్యేక దేశం కోసం  రెఫరెండం ప్రత్యర్థులు కొట్టుకునేవరకు వెళ్లింది. అమెరికాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

Viral Video: Khalistani Referendum In San Francisco Turns Violent, Clashes Break Out Between Rival Groups lns
Author
First Published Feb 3, 2024, 5:48 PM IST | Last Updated Feb 3, 2024, 5:48 PM IST

 వాషింగ్టన్: అమెరికాలో ఓ జరిగిన ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కొందరు వ్యక్తులు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. వారిని భద్రతా సిబ్బంది  అదుపులోకి తీసుకుంటున్నట్టుగా ఆ వీడియోలో  దృశ్యాలున్నాయి. 
 ఈ ఘర్షణలో పాల్గొన్న కొందరు ఖలీస్తానీ జెండాలను కూడ కలిగి ఉన్నారు. ఈ  ఏడాది జనవరి  28న ఈ ఘటన జరిగింది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో  ఖలిస్తాన్ రెపరెంఢం సమయంలో  ఘర్షణ జరిగినట్టుగా  సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్టు చేసిన ఓ నెటిజన్ పోస్టు చేశారు.   ది శాన్ ఫ్రాన్సిస్కో స్టాండర్ట్ నివేదిక ప్రకారం  ఈ ఏడాది జనవరి  28న వేలాది మంది ఖలీస్తానీ సానుభూతి పరులు కార్లు, బస్సులు, రైళ్లలో  శాన్ ఫ్రాన్సిస్కో కు చేరుకున్నారు.

  భారతదేశంలోని సిక్కులు అధికంగా ఉన్న పంజాబ్ రాష్ట్రం విడిపోయి ఖలీస్తాన్ అనే స్వతంత్ర దేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రెఫరెండం నిర్వహించారు.ఈ సమయంలో మేజర్ సింగ్ నిజ్జర్ గ్యాంగ్,  సరబ్జిత్ సింగ్ (సాబి) , గురపత్వంత్ సింగ్ పన్నూన్ గ్రూపులు పాల్గొన్నాయి. అయితే ఈ గ్రూపుల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని ఆ కథనం తెలిపింది.  

 

కాలిఫోర్నియాలోని  2,50,000 ల మంది సిక్కులున్నారు.  వీరిలో ఎక్కువ మంది సెంట్రల్ వ్యాలీ లేదా బే ఏరియాలో నివసిస్తున్నారు.  ప్రపంచంలో సిక్కులు నివసించే పలు నగరాల్లో  ఓటింగ్ నిర్వహిస్తున్నారు.  శాన్ ఫ్రాన్సిస్కో లో జనవరి  28న ప్రజాభిప్రాయసేకరణ (ఓటింగ్ ) నిర్వహించారు.  లండన్, జెనీవా, రోమ్, టొరంటో లలో కూడ ఓటింగ్ నిర్వహించనున్నారు.



 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios