వియత్నాం దేశానికి చెందిన వాన్ చిన్ అనే వ్యక్తి 80 ఏళ్లుగా తన జుట్టును కత్తిరించుకోలేదు. దీంతో ఆయన జుట్టు ఐదు మీటర్ల పొడవు పెరిగింది. ఈ జుట్టుతో ఆయన ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకొన్నాడు.

జుట్టు కత్తిరించుకొంటే చనిపోతానని ఆయన నమ్మకం . దీనితో మూడో తరగతి చదివే సమయంలో హెయిర్ కట్ చేయకూడదని ఆయన నిర్ణయం తీసుకొన్నారు.జుట్టును దువ్వుకొనేందుకు ఆయన ఏనాడూ కూడ ఆయన దువ్వెనను ఉపయోగించలేదు.

జుట్టును ముడివేస్తాడు. ముడివేసిన జుట్టును వస్త్రంతో కప్పి ఉంచుతారు.  జుట్టును కత్తిరించుకొంటే చనిపోతాననే భయంతోనే తాను ఈ జుట్టును కత్తిరించుకోవడం మానేసినట్టుగా ఆయన  న్యూస్ ఏజెన్సీకి చెప్పారు.

నెల రోజులు దాటితేనే జుట్టును కత్తిరించుకోకపోతే జుట్టంతా పెరిగి ఇబ్బంది పెడుతోంది. కానీ చిన్ మాత్రం తన జుట్టును 80 ఏళ్లుగా కట్ చేసుకోలేదు. దేవుడి పిలుపు మేరకే తాను జుట్టును కత్తిరించుకోలేదని  ఆయన చెప్పారు.జుట్టును కత్తిరించుకోకపోవడం వల్లే తాను ఇంత కాలం బతికి ఉన్నట్టుగా ఆయన విశ్వసిస్తున్నట్టుగా న్యూస్ ఏజెన్సీకి తెలిపారు.