నేతల ప్రచారాలు, పార్టీల వ్యూహా ప్రతివ్యహాలతో గల్లీ నుంచి ఢిల్లీ దాకకా పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ఆయువుపట్టు.. అయితే ఒక్కో దేశంలో ఒక్కో తరహాలో పోలింగ్ జరుగుతుంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. నేతల ప్రచారాలు, పార్టీల వ్యూహా ప్రతివ్యహాలతో గల్లీ నుంచి ఢిల్లీ దాకకా పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ఆయువుపట్టు.. అయితే ఒక్కో దేశంలో ఒక్కో తరహాలో పోలింగ్ జరుగుతుంది.
విక్టోరియా జలపాతం సవ్వడితో పాటు ప్రకృతి రమణీయతకు పెట్టింది పెరైన జాంబియాలో ఎన్నికలు అంతే విచిత్రంగా జరుగుతాయి. ఈ ఆఫ్రికన్ దేశంలో అక్షరాస్యత అతి స్వల్పం. దీంతో అక్కడి అధికారులు అందరితో ఓటు వేయించేందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు.
ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థికి ఓ రంగు డబ్బాను కేటాయిస్తారు. ఓటరు తనకు నచ్చిన నాయకుడి డబ్బాలో గోళీ వేయాలి. కౌంటింగ్ రోజున ఎవరి డబ్బాలో ఎక్కువ గోళీలు ఉంటే వారు గెలిచినట్లు. గోళీ విధానంతో ఎన్నిక పారదర్శకంగా జరుగుతుందా అని మీకు డౌట్ రావొచ్చు. అయితే ఓటరు గోళీ వేసిన వెంటనే గంట మోగుతుంది. ఒకరు ఒక గోళీ వేయడానికే అర్హులు.
