కరోనా వ్యాక్సిన్‌పై ట్రంప్ గుడ్ న్యూస్: ఈ ఏడాదిలోనే కోవిడ్ టీకా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వ్యాక్సిన్ పై కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాదిలోనే కరోనాకు వ్యాక్సిన్ అమెరికాలో రానుందపి ఆయన స్పష్టం చేశారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వ్యాక్సిన్ పై కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాదిలోనే కరోనాకు వ్యాక్సిన్ అమెరికాలో రానుందపి ఆయన స్పష్టం చేశారు.
మూడు రకాల వ్యాక్సిన్లు ఫైనల్ ట్రయల్ స్టేజీలో ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ వ్యాక్సిన్లను తాము ముందుగానే ఉత్పత్తి చేస్తున్నామని ఆయన చెప్పారు. దీంతోవ్యాక్సిన్ డోసులు పెద్ద ఎత్తున అందుబాటులోకి రానున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
సురక్షితమైన, ఎఫెక్టివ్ గా పనిచేసే వ్యాక్సిన్ ను ఈ ఏడాదిలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
శుక్రవారం నాడు రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ లో ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. యూఎస్ ఎన్నికలు మేం అమెరికన్ కలను కాపాడాలా వద్దా అనేది నిర్ణయిస్తోందని ఆయన చెప్పారు.
ప్రపంచంలోని సుమారు 12 కి పైగా సంస్థలు కరోనాను నివారణకు వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా వ్యాక్సిన్ ఆ దేశంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇండియాలో కూడ పలు సంస్థలు కరోనా వ్యాక్సిన్ తయారీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆయా సంస్థల వ్యాక్సిన్ పలు ట్రయల్స్ స్టేజీల్లో ఉన్నాయి.