Asianet News TeluguAsianet News Telugu

డబ్ల్యూహెచ్ఓతో అమెరికాకు ఇక సంబంధం లేదు: ట్రంప్ షాకింగ్ నిర్ణయం!

ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ తో తమ సంబంధ బాంధవ్యాలను పూర్తిగా తెంచేసుకుంటున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శుక్రవారం రోజున విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తిని తొలిదశలోనే నివారించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైందని ట్రంప్ మీడియా సమావేశంలో తెలిపారు. 

US Terminating Relationship With WHO, Announces Trump
Author
Washington D.C., First Published May 30, 2020, 6:15 AM IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ తో తమ సంబంధ బాంధవ్యాలను పూర్తిగా తెంచేసుకుంటున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శుక్రవారం రోజున విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తిని తొలిదశలోనే నివారించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైందని ట్రంప్ మీడియా సమావేశంలో తెలిపారు. 

నెలరోజుల కింద ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులను నిలిపివేసిన ట్రంప్ ఒక పది రోజుల కింద చైనా పాటపాడుతున్నారని ఆరోపించారు. వైఖరి గనుక మార్చుకోకపోతే నిధులను ఎప్పటికి పర్మనెంట్ గా నిలిపేస్తామని హెచ్చరించారు. 

వైరస్ తొలినాళ్లలోనే ప్రాపంచాన్ని హెచ్చరించడంతో, ఈ వైరస్ కట్టడికి చర్యలను తీసుకోవడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫెయిల్ అవడంతో తాము తమ సంబంధాలను పూర్తిగా తెంచేసుకుంటున్నట్టు, ఇంతకుమునుపు ఈ సంస్థకు ఇచ్చిన నిధులను ప్రాపంచవ్యాప్తంగా ఇతర అవసరమైన ఆరోగ్య అవసరాల కోసం వెచ్చిస్తామని తెలిపారు. 

ఇకపోతే... సోషల్ మీడియా సంస్థలకు సంబంధించి చట్టపరమైన రక్షణలను తొలగించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. సోషల్ మీడియా ఆన్ లైన్ కంటెంట్ ను తనిఖీ చేయడంపై చర్యలు తీసుకొనేలా ఈ నిర్ణయం తీసుకొన్నారు.

అమెరికా ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛ, ఇతర హక్కులను రక్షించేందుకు ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై సంతకం చేస్తున్నానని ట్రంప్ ఇటీవలనే ప్రకటించిన విషయం తెలిసిందే. ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా సంస్థలు తటస్థ వేదిక అనే సిద్దాంత వాడుకోలేరని ట్రంప్ చెప్పారు. గురువారం నాడు మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కమ్యూనికేషన్స్ డిసెన్సీ యాక్ట్  ప్రకారం కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సెన్సార్, లయబిలిటీ మసుగులో ఇక సోషల్ మీడియా సంస్థల ఆటలు సాగవని ట్రంప్ పేర్కొన్నారు. ఈ  విషయంలో రాష్ట్రాలతో  కలసి పనిచేయాలని అటార్నీ జనరల్‌కు దిశానిర్దేశం చేస్తున్నామన్నారు.

అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్విట్ట‌ర్ జోక్యం చేసుకుంటున్న‌ట్లు తాజాగా ట్రంప్ ఆరోపించిన విష‌యం తెలిసిందే.  ట్రంప్ చేసిన రెండు ట్వీట్ల‌కు ట్విట్ట‌ర్‌ ఫ్యాక్ట్ లేబుల్ చెక్ పెట్టింది. దీంతో ట్రంప్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

ట్విట్ట‌ర్‌ను బ్యాన్ చేస్తా అని ఆయ‌న హెచ్చరించారు..  క‌మ్యూనికేష‌న్స్ డీసెన్సీ యాక్ట్‌లోని 230వ సెక్ష‌న్ ప్ర‌కారం.. పోస్టు పెట్టిన‌వారే త‌మ కాంటెంట్‌కు బాధ్యులుగా ఉంటారు. 

ఇప్ప‌టి వ‌ర‌కు ఆ రూల్ సోష‌ల్ మీడియా సంస్థ‌ల‌కు ర‌క్ష‌ణ‌గా నిలిచింది. కానీ యూజ‌ర్ పెట్టిన పోస్టును ఎవ‌రైనా ఎడిట్ చేస్తే, అప్పుడు అది రూల్‌ను అతిక్ర‌మించిన‌ట్లే అని ట్రంప్ త‌న తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్‌లో పేర్కొన్నారు. 230 సెక్ష‌న్‌ను మార్చ‌నున్న‌ట్లు ట్రంప్ త‌న ఆదేశంలో తెలిపారు.

మెయిల్‌-ఇన్ బ్యాలెట్ విధానానికి వ్యతిరేకంగా ఇటీవల తాను పెట్టిన పోస్టులపై ట్విటర్ ఫ్యాక్ట్ చెక్ లేబుల్ వేయడంపై  ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.  

ఈ వివాదం నేపథ్యంలోనే తాజా పరిణామం చోటు చేసుకుంది. కాగా ఫేస్‌బుక్, ట్విటర్, గూగుల్ లాంటి సామాజిక మాధ్యమాలు పక్షపాతపూరితంగా వ్యవహరిస్తున్నా యంటూ గతం కొంత కాలంగా  ఆయన మండిపడుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios