పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఎఫ్ -16  యుద్ధ విమానాన్ని భారత వైమానిక దళం కూల్చివేసిన కొన్ని నెలల తరువాత, తమ మధ్య ఉన్న ఒప్పందానికి తూట్లు పొడవడంపై అమెరికా సీరియస్ అయ్యింది.  ఎఫ్ -16 ఫైటర్ జెట్‌లను దుర్వినియోగం చేసినందుకు అమెరికా ఆగస్టులో పాకిస్తాన్ వైమానిక దళ చీఫ్‌ను మందలించింది. 

ఈ విషయంపై అప్పటి స్టేట్ ఫర్ ఆర్మ్స్ కంట్రోల్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ వ్యవహారాల అండర్ సెక్రటరీ ఆండ్రియా థాంప్సన్ పాకిస్తాన్ వైమానిక దళం చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ముజాహిద్ అన్వర్ ఖాన్‌కు ఆగస్టులో ఒక లేఖ రాశారని బుధవారం అమెరికాలో వార్త ప్రసారమయ్యింది. 

Also read; పాక్ గడ్డపై ఉగ్రవాద సంస్థలు ఉన్నది నిజం కాదా... ఇమ్రాన్ కి భారత్ కౌంటర్

ఫిబ్రవరి 26 బాలకోట్ వైమానిక దాడుల తరువాత జరిగిన సంఘటనలను నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఫిబ్రవరిలో కాశ్మీర్‌పై ఎఫ్ -16 విమానాలను ఉపయోగించడంపై స్పందనగానే దీన్ని మనం అర్థం చేసుకోవాలిసి ఉంటుంది. 

జాతీయ అవసరాలకోసం మాత్రమే ఈ విమానాలను వినియోగించినప్పటికీ, ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఈ విమానాన్ని ఈ విధంగా అక్రమంగా వినియోగించడం తప్పు అని అమెరికా పాకిస్తాన్ ను హెచ్చరించింది. ఉగ్రవాదంపై పోరు కోసం మాత్రమే ఈ విమానాలను ఉపయోగించాలని పాకిస్తాన్ కు అమెరికా షరతును విధించిన విషయం మనందరికీ తెలిసిందే. 


ఫిబ్రవరి 14 న జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ (జెఎమ్) టెర్రర్ గ్రూపుకు చెందిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సిఆర్‌పిఎఫ్ సిబ్బంది మృతి చెందారు.

ఫిబ్రవరి 26 న బాలకోట్‌లోని జెఎమ్ శిక్షణా శిబిరాన్ని అంతం చేసేందుకు, భారతదేశం తీవ్రవాదాన్ని కూకటి వేళ్ళతో సహా పెకిలించి వేసేందుకు తగు చర్యలను ప్రారంభించింది. ఇందులో భాగంగానే బాలాకోట్ పై వైమానిక దాడులకు దిగింది భారత్. 

మరుసటి రోజు, పాకిస్తాన్ వైమానిక దళం ప్రతీకారంతో రగిలిపోతూ భారత భూభాగంలోకి రంకెలేసుకుంటూ చొచ్చుకొచ్చాయి. దీనికి భారత వాయుసేన ధీటుగా సమాధానం చెప్పింది.  వైమానిక పోరాటంలో మిగ్ -21  పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమన్ ను పట్టుకుంది, తరువాత అతన్ని విడుదల కూడా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. 

Also read; పాకిస్తాన్ లో మరో సైనిక తిరుగుబాటును చూస్తున్నామా?

ఫిబ్రవరి 27 న భారత్, పాక్ విమానాలమధ్య జరిగిన పోరులో అభినందన్ వర్థమాన్ పైలట్ గా వ్యవహరించిన మిగ్ -21 బైసన్ ఒక ఎఫ్ -16 ను కూల్చివేసిందని ఐఎఎఫ్ తెలిపింది. కాశ్మీర్‌లో భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన వైమానిక దాడిలో పాకిస్థాన్... అమెరికా తయారు చేసిన ఎఫ్ -16 యుద్ధ విమానాలను వినియోగించిందని నిరూపించడానికి సాక్ష్యంగా ఫిబ్రవరి 28 న కూల్చివేయబడ్డ పాకిస్తాన్ వాయు సేనకు చెందిన ఎఫ్ -16 శకలాలను ప్రదర్శించింది.

పాకిస్థాన్ కు ఎఫ్-16 విమానాలను సరఫరా చేసేటప్పుడు అమెరికా స్పష్టంగా కొన్ని కండిషన్స్ ని పెట్టింది అమెరికా. సదరు ఎఫ్-16 యుద్ధ విమానాలను కేవలం తీవ్రవాదులపై పోరుకు మాత్రమే వినియోగించాలనే షరతును అమెరికా విధించింది. ఇలా భారత దేశంపై దాడికి వినియోగించడంపై అమెరికా సీరియస్ అయ్యింది.