ఓ వైపు కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతున్న తరుణంలోనే.. మంకీపాక్స్ ప్రపంచాన్ని టెన్షన్ పెడుతుంది. రోజురోజుకు మంకీపాక్స్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే తాజాగా ఒకే వ్యక్తికి కరోనాతో పాటు మంకీ పాక్స్ సోకినట్టుగా తెలుస్తోంది. 

ఓ వైపు కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతున్న తరుణంలోనే.. మంకీపాక్స్ ప్రపంచాన్ని టెన్షన్ పెడుతుంది. రోజురోజుకు మంకీపాక్స్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే తాజాగా ఒకే వ్యక్తికి కరోనాతో పాటు మంకీ పాక్స్ సోకినట్టుగా తెలుస్తోంది. తొలుత అతనికి కరోనా నిర్దారణ కాగా.. అదే సమయంలో మంకీపాక్స్ సోకినట్టుగా తేలింది. అమెరికాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా అక్కడి మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి. వివరాలు.. కాలిఫోర్నియాకు చెందిన మిట్చో థాంప్సన్‌కు జూన్ చివరలో కరోనా వైరస్ నిర్దారణ అయింది. అయితే కొన్ని రోజుల తర్వాత అతనికి వీపు, కాళ్లు, చేతుల, మెడపై ఎర్రటి గాయాలు కనిపించాయి. 

దీంతో మిట్చో థాంప్సన్ వైద్యులను సంప్రదించగా.. అతనికి మంకీపాక్స్ సోకిందని తెలిపారు. ఈ విషయాన్ని మిట్చో థాంప్సన్ అమెరికాకు చెందిన ఎన్‌బీసీ నెట్‌వర్క్‌కు చెప్పారు. తనకు కరోనాతో పాటు, మంకీపాక్స్‌ ఉన్నాయని డాక్టర్ కచ్చితంగా చెప్పారని అన్నారు. రెండు వైరస్‌లు సోకడంతో ఇన్‌ఫ్లుఎంజా తీవ్రమైన కేసుగా భావించినట్టుగా చెప్పారు. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చలి, శరీర నొప్పులు, చర్మ గాయాలు కూడా ఉన్నాయని తెలిపారు. 

తీవ్ర అనారోగ్యంతో బాధపడినట్టుగా మిట్చో థాంప్సన్ గుర్తుచేసుకున్నారు. కనీసం బెడ్ మీద నుంచి లేవలేకపోయానని తెలిపారు. నీరు త్రాగడం కూడా ఇష్టపడలేదని చెప్పారు. అయితే ఒకే వ్యక్తికి ఒకే సమయంలో రెండు వైరస్‌లు సోకిన విషయాన్ని అమెరికా ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించలేదు. దీనిని అరుదైన కేసుగా నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలోని ఒక ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ మాట్లాడుతూ.. ఎవరైనా ఒకేసారి రెండు వైరస్‌ల బారిన పడే అవకాశం ఉందని తెలిపారు. ద

ఇక, ప్రపంచ ఆరోగ్య సంస్థ శనివారం మంకీపాక్స్‌ను అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. అంతర్జాతీయంగా మంకీపాక్స్ ముప్పు మాడరేట్‌గా ఉన్నప్పటికీ యూరపియన్ రీజియన్‌లో మాత్రం రిస్క్ తీవ్రంగా ఉన్నదని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ వివరించారు. అంతర్జాతీయంగా ఈ ముప్పు తీవ్రత చిక్కబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, ఈ వైరస్ అంతర్జాతీయ ప్రయాణాల ద్వారా ఎక్కువగా వ్యాపించే ముప్పు ప్రస్తుతానికి కనిపించడం లేదని చెప్పారు.