అమెరికాలో మరణ మృదంగం.. ఒక్కరోజే 2,228మంది మృతి

తీవ్రత ఎక్కువగా ఉన్న న్యూయార్క్ లో మరణాల సంఖ్య 10,842కు చేరింది. బాధితుల సంఖ్య 2,03,020కు చేరింి. వైరస్ పై చేస్తున్న పోరులో క్రమంగా పురోగతి సాధిస్తున్నామని ట్రంప్ చెబుతున్నారు.
US coronavirus deaths set single-day record as total hits 28,300
అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. కుప్పలు కుప్పలుగా జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు. చనిపోయిన వారిని పాతిపెట్టడానికి కూడా స్థలాలు దొరకడం లేదు. అంత దారుణంగా అమెరికా పరిస్థితి మారిపోయింది.

కేవలం నిన్న ఒక్క రోజే అక్క 2,228మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో ఇప్పటిదాకా అమెరికాలో మరణించిన వారి సంఖ్య 28,300కు చేరింది. ఆరు లక్షల మందికి పైగా కరోనా వైరస్ బారిన పడ్డారు.

తీవ్రత ఎక్కువగా ఉన్న న్యూయార్క్ లో మరణాల సంఖ్య 10,842కు చేరింది. బాధితుల సంఖ్య 2,03,020కు చేరింి. వైరస్ పై చేస్తున్న పోరులో క్రమంగా పురోగతి సాధిస్తున్నామని ట్రంప్ చెబుతున్నారు. కంటికి కనపడని శత్రవుతో పోరాడి మరణించిన వారి త్యాగాలను వృథా పోనివ్వమని ఆయన పేర్కొన్నారు.

ఇంతటి చీకటి రోజుల్లోనూ వెలుగులు కనిపిస్తున్నాయన్నారు. పరోక్షంగా పలు ప్రాంతాల్లో వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య తగ్గుతుండటాన్ని ప్రస్తావించారు. ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో అత్యధిక తలసరి ఐసీయూలు ఉణ్నాయని చెప్పారు. అదేవిధంగా 16వేల వెంటిలేటర్లు ఉన్నాయని చెప్పారు.

ఇక రోగుల లాలాజలంతో పరీక్షించే విధానాన్ని రట్ గర్స్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిందని ట్రంప్ వెల్లడించారు. ఈ విధానంలో రోగులు వారి పరీక్షకు వారే నిర్వహించుకోవచ్చు అని చెప్పారు. తద్వారా వైరస్ బారిన వైద్య సిబ్బంది పడకుండా ఉంటారని చెప్పారు.
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios