Asianet News TeluguAsianet News Telugu

నూజెర్సీలో కాల్పుల కలకలం... ఆరుగురు మృతి

పోలీసులకు, దుండగులకు  మధ్య దాదాపు గంటపాటు ఈ కాల్పుల పోరు జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో వందల రౌంట్ల కాల్పులు జరిపారు.

US: 6 including police officer killed in New Jersey shooting
Author
Hyderabad, First Published Dec 11, 2019, 8:51 AM IST

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. న్యూజెర్సీ రాష్ట్రంలోని జెర్సీ నగరంలో పోలీసులకు దుండగులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. సేక్రేడ్‌ హార్ట్‌ స్కూల్‌ సమీపంలో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. 

ఈ కాల్పుల్లో పోలీస్‌ అధికారితో సహా ఆరుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే అగంతకులు కాల్పులకు పాల్పడిన సమయంలో పిల్లలు స్కూల్లోనో ఉండడంతో భారీ ప్రాణనష్టం తప్పిందని అధికారులు చెబుతున్నారు. పోలీసులకు, దుండగులకు  మధ్య దాదాపు గంటపాటు ఈ కాల్పుల పోరు జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో వందల రౌంట్ల కాల్పులు జరిపారు.

ఈ ఘటన నేపథ్యంలో స్థానిక పాఠశాలలు, ఇతర దుకాణాలు వెంటనే మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కాల్పుల్లో మరణించిన పోలీసు అధికారి గతంలో తుపాకీ విష సంస్కృతి నిర్మూలనకు కృషి చేశారు.

ఘటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. దీన్ని ఓ భయంకరమైన ఘటనగా  ఆయన అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతి వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. కావాల్సిన సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios