ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే.. ఒకరిని మరొకరు కొట్టుకోవడం, తిట్టుకోవడం లాంటివి చేస్తుంటారు. ఇది చాలా కామన్. అయితే.. ఇద్దరు కవలలు మాత్రం ఇంకా పుట్టనేలేదు అప్పుడే.. కపులోనే కొట్టుకుంటున్నారు. 

నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. చైనాకు చెందిన మహిళకు నాలుగో నెలలో స్కానింగ్ తీయగా.. అందులో కవలలు ఒకరిని మరొకరు కొట్టుకుంటున్నారు.  దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట షేక్ చేస్తోంది.

మహిళకు స్కానింగ్ చేస్తుండగా ఇలాంటి దృశ్యం కనపడటంతో ఆమె భర్త దానిని వీడియో తీశాడు. అనంతరం దానిని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ క్యూట్ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. కడుపులోనే ఇలా కొట్టుకుంటున్నారంటే.. బయటకు వచ్చాక ఇంకెలా కొట్టుకుంటారో అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.