Russia Ukraine war: రష్యాకు ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో ఎదురు దెబ్బ తగిలింది. అంతర్జాతీయ మానవ హక్కుల మండలిలో రష్యా సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ గురువారం నిర్ణయం తీసుకున్నది. ఉక్రెయిన్‌లోని బుచా పట్టణంలో రష్యా సైన్యాలు ఇష్టానుసారంగా ప్రవర్తించాయి. రష్యా సైన్యాలు వేలాది మృతదేహాలను సామూహికంగా ఖననం చేసిన దృశ్యాలు వెలుగు చూశాయి.
Russia Ukraine war: ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు చేస్తునే ఉంది. దాదాపు రెండు నెలులగా రష్యా బలగాలు ఉక్రెయిన్ పై విచక్షణ రహితంగా దాడులు చేస్తునే ఉంది. రష్యా సేనాలు చేసిన దాడుల వల్ల ఉక్రెయిన్ తన రూపురేఖలే పూర్తిగా మరిపోయాయి. ఉక్రెయిన్ లో ఎక్కడ చూసినా.. ధ్వంసమైన భవనాలు, శవాల గుట్టలు దర్శమిస్తున్నాయి. పుతిన్ యుద్ధోన్మాదం వలన ఉక్రెయిన్ సర్వ నాశనమైంది.
నిత్యం ఎదొక చోట బాంబులు, క్షిపణుల దాడులతో ఉక్రెయిన్ వాసులను రష్యాన్ బలాగాలు భయపడుతున్నాయి. ప్రధాన నగరాలలో పలు చోట్ల ఒళ్లు గగ్గుర్పాటుకు గురిచేసే దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. కుప్పలు తెప్పలుగా శవాలు, వాటికి సామూహిక ఖననాలు, చేతులను వెనక్కు కట్టి పాయింట్ బ్లాంక్‌లో పెట్టి కాల్చి చంపిన ఘటనలు వెలుగు చూశాయి.
ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సంచలన నిర్ణయం తీసుకుంది. రష్యాను మానవ హక్కుల మండలి నుండి సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. ఇందుకు ప్రధాన కారణంగా.. బుచా పట్టణం తోపాటు ఉక్రెయిన్ రాజధాని కీవ్ తదితర పట్టణాలు, నగరాలో రష్యా పౌర హత్యల సాక్ష్యం గా చూపించింది. ఈ ఘటనలతో ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతికి లోనయ్యాయని, మాస్కోపై కొత్త ఆంక్షల విధించాలని ఉక్రెయిన్ పిలుపునిచ్చింది.
రష్యాను మానవ హక్కుల మండలి నుండి సస్పెండ్ చేయాలనే తీర్మానాన్ని యునైటెడ్ స్టేట్స్ ప్రతిపాదించగా.. 93 మంది సస్పెన్షన్‌కు అనుకూలంగా ఓటు వేయగా, 24 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు మరియు 58 మంది గైర్హాజరయ్యారు, ఐక్యరాజ్యసమితిలో రష్యాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ఐక్యతను బలహీనపరిచేలా సూచించారు. దీంతో రష్యాపై సస్పెన్షన్ విధించారు. కౌన్సిల్ నుంచి ఒక దేశం సస్పెన్షన్‌కు గురికావడం ఇది రెండోసారి. 2011లో లిబియా పై సస్పెన్షన్ విధించింది ఐరాస.
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నుండి రష్యాను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నందుకు ఉక్రెయిన్ ప్రపంచ దేశాలకు కృతజ్ఞతలు తెలిపింది. యుద్ధ నేరస్థులు ప్రాతినిధ్యం వహించకూడదని పేర్కొంది. అలాగే.. మానవ హక్కులను పరిరక్షించే ఐక్యరాజ్యసమితి సంస్థల్లో యుద్ధ నేరగాళ్లకు చోటు లేదని విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
కానీ తమ సైనిక బలగాలు ఉక్రెయిన్ పౌరులను చంపలేదని రష్యా వాదిస్తున్నది. బుచా పట్టణంలో మారణకాండ.. ప్రపంచ దేశాలను షాక్‌కు గురి చేసింది. దీంతో రష్యాను కట్టడి చేసేందుకు అమెరికా, దాని మిత్ర దేశాలు మరిన్ని ఆంక్షలు విధించనున్నాయి. ఉక్రెయిన్ పౌరుల మరణాలకు బాధ్యత వహించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిరాకరించారు. బుచా పట్టణంలో ఉక్రెయిన్ అధికారులే క్రూరంగా, రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఆరోపించారు.
