Russia Ukraine War:  బుచా ప‌ట్ట‌ణంలో ర‌ష్యా సైన్యం సృష్టించిన‌ మార‌ణ హోమంపై నేడు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రసంగిస్తానని జెలెన్‌ స్కీ చెప్పారు. బ‌హిరంగ పారదర్శక దర్యాప్తుపై త‌మ‌కు న‌మ్మ‌కం  ఉందని స్ప‌ష్టం చేశారు. ర‌ష్యా దాడి ఫలితాలను య‌వాత్తు అంతర్జాతీయ సమాజం కూడా తెలుసుకుంటుంద‌ని వివ‌రించారు. ఇక.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. బుచాలో అకృత్యాలకు యుద్ధ నేరాల విచారణ ఎదుర్కొనాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ అన్నారు 

Russia Ukraine War: ఉక్రెయిన్ లో ర‌ష్యా బలాగాలు నర మేధానికి పాల్పడ్డాయి. ఉక్రెయిన్ పౌరులపై త‌మ రాక్ష‌స‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించాయి. సామాన్య ప్ర‌జానీకంపై ర‌ష్యా సేన‌లు త‌మ ఇష్టానుసారంగా ప్ర‌వ‌ర్తించాయి. ఉక్రెయిన్ స‌మీపంలోని బుచా ప‌ట్ట‌ణంలో ర‌ష్యా సైన్యం మార‌ణ హోమం చేసింది. ఈ న‌గ‌రంలో వారి ఆగ‌డాల‌కు అడ్డు అదుపు లేకుండా పోయింది. పౌరుల కాళ్లు చేతులు కట్టేసి.. తలలో బుల్లెట్లు దించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు చూస్తే.. ఒళ్లు గగుర్లు పొడిచేలా ఉన్నాయి.

ఉక్రెయిన్‌లో జరిగిన మారణహోమం తాలుకా పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. రాజధాని కీవ్‌కు ఇంతకాలం అడ్డుగోడగా నిలిచిన బుచా పట్టణంలో.. శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. మరోవైపు మహిళలపై నడిరోడ్డుపైనే అఘాయిత్యాలు జరిగినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో ఉక్రెయిన్‌, అమెరికాలు రష్యాపై తీవ్రస్థాయిలో ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి.

బుచా ప‌ట్ట‌ణంలో 45 అడుగుల కందకం తవ్వి 410 మృతదేహాలను ఖననం చేసిన దృశ్యం రష్యా సైన్య యొక్క‌ క్రూరత్వానికి సాక్ష్యంగా క‌నిపిస్తోంది. యుద్ద స‌మ‌యంలో పౌరులను, చిన్నారుల‌ను, ప్రజా ప్రతినిధులను ఎత్తుకెళ్లి మరీ దారుణంగా హతమార్చారు. వందలాది మహిళాల‌పై ఆఘ‌త్యాల‌కు పాల్ప‌డ్డారు. ఈ దురాగతాలపై అమెరికా సహా ప్రపంచ దేశాలన్నీ మండిపడుతున్నాయి. వీటిని యుద్ధనేరాలుగా పరిగణించాలని, రష్యాపై ఆంక్షల్ని మరింత కఠినతరం చేయాలని అమెరికా అధ్యక్షుడు
డిమాండ్ చేస్తున్నారు. 

బుచా మ‌ర‌ణాహోమంపై పోలిష్ ప్రధాన మంత్రి మాటెస్జ్ మొరావికీ స్పందించారు. దీనిని జాతి నిర్మూలన చ‌ర్య పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌నపై అంతర్జాతీయ దర్యాప్తున‌కు పిలుపునిచ్చారు. ఈ ఘ‌ట‌న‌పై ఉక్రేనియన్ ప్రాసిక్యూటర్ జనరల్ ఇరినా వెనెడిక్టోవా మాట్లాడుతూ.. రష్యా దళాలు వెనక్కి తగ్గిన తర్వాత కైవ్ ప్రాంతంలో 410 పౌరుల‌ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బుచా మరణాహోమాన్ని ప్ర‌పంచ‌దేశాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కానీ, బుచ ప‌ట్ట‌ణంతోపాటు ఉక్రెయిన్‌లో పౌరుల‌ను హ‌త్య చేశామ‌న్న ఆరోప‌ణ‌ల‌ను ర‌ష్యా నిరాక‌రిస్తున్న‌ది.

క్రెమ్లిన్ కైవ్ సమీపంలో పౌరులను చంపడానికి రష్యన్ దళాలు కారణమని ఆరోపణలను క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ 
తిరస్కరించారు. ఆరోప‌ణ‌ల‌న్ని అవాస్త‌మ‌ని, వాటిని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నామని తెలిపారు. వీటిపై విచారణకు రష్యా తక్షణమే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశానికి విజ్ఞప్తి చేసినా, చైర్మన్‌ హోదాలో ఉన్న యూకే దీనిని తోసిపుచ్చింది. అయితే, బుచాలో రష్యా మారణాకండపై మంగళవారం భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించాలని యూకే సోమవారం నిర్ణయించింది.

భద్రతా మండలిలో ప్ర‌సంగించ‌నున్న జెలెన్‌ స్కీ

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ సోమవారం బుచాలో పర్యటించారు. యుద్ధం ముగింపునకు త్వరగా చర్చలకు కదలాలని రష్యాను కోరారు. బుచా మ‌ర‌ణాకాండ‌పై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. రష్యా బలగాల నుండి ఉక్రెయిన్ పట్టణాన్ని వెనక్కి తీసుకున్న తర్వాత సామూహిక సమాధులు, మృతదేహాలు ద‌ర్శ‌న‌మిచ్చాయ‌ని, బుచాలో కనీసం 300 మంది పౌరులు మరణించారని, బోరోడియంకా, ఇతర పట్టణాలలో ప్రాణనష్టం సంభవించవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్‌లో పౌరుల హత్యపై అత్యంత బహిరంగ విచారణ జరపడంపై త‌న‌కు న‌మ్మ‌కం వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో మం గ‌ళ‌వారం.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రసంగిస్తానని జెలెన్‌ స్కీ చెప్పారు. పారదర్శక దర్యాప్తుపై త‌మ‌కు న‌మ్మ‌కం ఉందని స్ప‌ష్టం చేశారు.

ర‌ష్యా దాడి ఫలితాలు మొత్తం అంతర్జాతీయ సమాజం కూడా తెలుసుకుంటుంద‌ని వివ‌రించారు. ఇక.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. బుచాలో అకృత్యాలకు యుద్ధ నేరాల విచారణ ఎదుర్కొనాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ అన్నారు. కాగా, యుద్ధ విధ్వంసాన్ని బయటకు తెలియజేసేందుకు ఉక్రెయిన్‌కు పరిశోధక బృందాన్ని పంపుతున్నట్లు ఈయూ చీఫ్‌ ఉర్సులా వాండెర్‌ తెలిపారు. బుచాలో పౌరుల మరణాలపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.