Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై రష్యా ముప్పేట దాడులతో విరుచుకు పడుతునే.. రష్యాన్ బలగాలు ప్రోరుడ్నే మేయర్‌ను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి దిమిత్రో కులేబా ప్రకటించారు. ‘రష్యా బలగాలు నేడు ద్నిప్రోరుడ్నే మేయర్ యెవ్‌హన్ మాత్వేయెవ్‌ను కిడ్నాప్ చేశాయి. అని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
Russia Ukraine Crisis: గత రెండు వారాలుగా ఉక్రెయిన్ పై రష్యా ముప్పేట దాడులతో విరుచుకు పడుతుంది. విచక్షణ రహితంగా.. విధ్వంసం సృష్టిస్తుంది. ఇప్పటికే పలు నగరాలను ధ్వంసం చేసి.. ఆక్రమించాయి రష్యా దళాలు. ఆ దేశంలోని నగరాలను స్మశానాలు మార్చేశాయి. యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని ప్రపంచ దేశాలు విజ్ఞప్తులు చేస్తున్నా.. పలు అంతర్జాతీయ సంస్థలు ఆంక్ష్లలు విధిస్తున్నా కూడా రష్యా మాత్రం వాటిని లెక్కచేయకుండా ఉక్రెయిన్ పై బాంబులతో విరుచుకుపడుతూనే ఉంది. రాకెట్ లతో విద్వంసం సృష్టిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. రష్యా బలగాలు మరోవైపు దారుణాలకు ఒడిగడుతున్నాయి. ఓ వైపు దాడులు చేస్తూనే ప్రముఖ నేతలను కిడ్నాప్ చేస్తున్నాయి. రెండ్రోజుల కిందట మెలిటోపోల్ మేయర్ ను కిడ్నాప్ చేసిన రష్యన్ దళాలు.. ఇవాళ మరో మేయర్ ని కిడ్నాప్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
తాజాగా.. ద్నిప్రోరుడ్నే మేయర్‌ను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి దిమిత్రో కులేబా ప్రకటించారు. ‘రష్యా బలగాలు నేడు ద్నిప్రోరుడ్నే మేయర్ యెవ్‌హన్ మాత్వేయెవ్‌ను కిడ్నాప్ చేశాయి. స్థానికుల నుంచి సహకారం కరవవడంతో రష్యా దళాలు అసహనంతో ఊగిపోతున్నాయి. ఇందుకు పలు ఘటనలు రుజువు చేస్తున్నాయి అని రష్యన్ బలగాలు హింసకు పాల్పడుతున్నాయి అని ఆరోపించారు.
ఉక్రెయిన్ లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు, రష్యా దౌర్జన్యకాండను నిలువరించేందుకు చొరవ చూపాలని అంతర్జాతీయ సంస్థలు కృషి చేయాలని ట్విట్టర్ వేదికగా ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి మరోసారి పిలుపునిచ్చారు. అంతకముందు దక్షిణ ఉక్రెయిన్‌లోని మెలిటొపోల్‌ను అధీనంలోకి తీసుకున్న రష్యా సైనికులు.. అనంతరం.. ఆ నగర మేయర్ ఇవాన్ ఫెడోరోవ్‌ను కిడ్నాప్ చేశారు. ఆయనను ఆయుధాలతో భయపట్టి.. బలవంతంగా తీసుకెళ్తున్న వీడియోను ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం డిప్యూటీ హెడ్ కిరిల్ తిమోషెంకో ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం... ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కిడ్నాప్‌ను అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ధ్రువీకరించారు. ‘రష్యా ఉగ్రవాదం కొత్త రూపం దాల్చిందనీ, చట్టబద్ధ ప్రతినిధులపై భౌతిక దాడులకు పాల్పడుతోంది. ఈ రష్యా చర్యలు ఐసిస్ ఉగ్రవాదుల కంటే ఏం తక్కువ కాదని జెలెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
