రష్యా దాడుల్లో తమ దేశంలోని 352 మంది సామాన్యులు మరణించారని ఉక్రెయిన్ ప్రకటించింది. ఇందులో 14 మంది చిన్నారులు కూడా ఉన్నారని ఆ దేశం తెలిపింది.  

కీవ్: Russia దాడులతో ఇప్పటివరకు 14 మంది చిన్నారులు సహా 352 మంది పౌరులు మరణించారని Ukraine ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీ తెల్లవారుజాము నుండి ఉక్రెయిన్ పై రష్యా దాడులకు దిగుతుంది.

తమ దేశంలోని అతి పెద్ద రెండో నగరంగా ఉన్న kharkiv పై రష్యా Army విధ్వంసం సృష్టించినట్టుగా ఉక్రెయిన్ ప్రకటించింది. ఖార్కివ్ లో రష్యా దాడుల్లో కనీసం 11 మంది సామాన్యులు మరణించినట్టుగా ఉక్రెయిన్ వివరించింది. ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ప్రారంభించిన రోజు నుండి ఇప్పటివ రకు సుమారు 5 మిలియన్ల ప్రజలు ఉక్రెయిన్ ను వీడి వెళ్లారని ఐక్యరాజ్యసమితి శరణార్ధి విభాగం ప్రకటించింది.

satellite తాజా చిత్రాల మేరకు ఉక్రెయిన్ రాజధాని Kviv నగరానికి 64 కి.మీ దూరంలో రష్యా సైన్యం ఉంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ France అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ తో మాట్లాడారు. ఉక్రెయిన్ తటస్థంగా ఉంటేనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. 

UNO జనరల్ అసెంబ్లీ సమావేశానికి India గైర్హాజరైంది. బెలారస్ లో సోమవారం నాడు ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చలు ఇంకా కొనసాగే అవకాశం ఉంది. జాతీయ భద్రతా సమస్యలపై ఐక్యరాజ్యసమితిలోని 12 మంది రష్యన్ దౌత్యవేత్తలను అమెరికా బహిష్కరించింది.

ఉక్రెయిన్ కు పాశ్చాత్య దేశాల నుండి మద్దతు పెరుగుతుంది., బ్రిటన్ నుండి ఆయుధాలు ఉక్రెయిన్ కు భారీగా వస్తున్నాయి. ఫిన్లాండ్ 2500 అసాల్డ్ రైఫిల్స్, 1500 యుద్ధ ట్యాంకులను పంపనుంది. కెనడా యాంటీ ట్యాంక్ ఆయుధాలు, మందు గుండు సామాగ్రిని సరఫరా చేస్తుందని ఆ దేశ ప్రధాని ట్రూడో ప్రకటించారు.మరో వైపు రష్యాపై అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలను విధిస్తున్నాయి. రష్యా కూడా తమపై ఆంక్షలు విధించిన దేశాలపై కౌంటర్ గా ఆంక్షలను విధిస్తుంది.

రష్యా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పలు దేశాలు ఇటీవల రష్యా నుంచి తమ దేశాలకు వచ్చే విమానాలను నిషేధించాయి. అమెరికా సహా యూరోప్ లోని 16 దేశాలు రష్యా విమానాలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. 

త‌న‌ను హెచ్చ‌రించిన దేశాల‌కు దీటుగా స‌మాధానమిచ్చారు. ర‌ష్యాపై ఆంక్షాలు విధించినా.. బ్రిటన్‌, జర్మనీ సహా 36 దేశాల విమాన సేవల‌పై ర‌ష్యా నిషేధం విధించింది. రష్యా ఎయిర్‌పోర్టుల్లో కార్యకలాపాలు, గగనతలాన్ని ఆయా దేశాల విమానాలు వినియోగించుకోవడాన్ని నిషేధించింది. రష్యా ఏవియేష‌న్ అథారిటీ ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది

రష్యా విమానాలతోపాటు గగనతలం వినియోగంపై యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు నిషేధం విధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రష్యా అధికారులు ఈ మేరకు వెల్లడించారు. మరోవైపు రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ ఐక్య రాజ్య స‌మితితో భేటీ కావ‌డానికి జెనీవాకు వెళ్లాల‌ని నిర్ణ‌యించారు. కానీ, చ‌ర్చ‌లు విఫ‌లం కావ‌డంతో ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు. 

ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ కు సంబంధించి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో వచ్చే వారం ఓటింగ్ జరగనుంది. రష్యా తీరును భద్రతా మండలిలో 12 దేశాలు తీవ్రంగా తప్పు బట్టిన విషయం తెలిసిందే.