Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై రష్యా దాడులు మరింతగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ ప్రభుత్వం మరోసారి మార్షల్ లా ను పొగిడిస్తూ నిర్ణయం తీసుకుంది. మరో 30 రోజులు దేశంలో మార్షల్ లా కొనసాగించడానికి ఆ దేశ ప్రెసిడెంట్ పార్లమెంట్‌కు బిల్ ను సమర్పించారు.
Russia Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ రష్యాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఆ దేశంలోని సైనిక స్థావరాలను లేకుండా చేసేంతవరకు దాడులు కొనసాగిస్తామని రష్యా పేర్కొంటోంది. ప్రపంచ దేశాలు యుద్ధం ఆపాలని పేర్కొంటున్నాయి. ఇవేవి లెక్కచేయని రష్యా ..మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే దేశంలో మార్చి 24 నుండి మరో 30 రోజుల పాటు మార్షల్ లా పొడిగించాలని కోరుతూ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ సోమవారం ఆలస్యంగా పార్లమెంటుకు బిల్లును సమర్పించారు. రష్యా దాడులు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసకున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతోంది. రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం 20 రోజులకు చేరుకుంది. పుతిన్ ఆదేశాలతో మరింత దూకుడుగా ముందుకుసాగుతూ.. విధ్వంసం సృష్టిస్తున్నాయి. రష్యా మరింత దూకుడుగా ప్రదర్శిస్తుండటంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే శాంతియుతంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని చాలా దేశాలు కోరుతున్నాయి. అయినప్పటికీ రష్యా ఏమాత్రం పట్టించుకోకుండా దూకుడుగా ముందుకు సాగుతూ.. ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే పలు మార్లు ఆ దేశ నేతలు అణుబాంబు దాడులు గురించి ప్రస్తావించడం ఉక్రెయిన్ తో పాటు యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ పై అనేక దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. రష్యా సైతం వెనక్కి తగ్గకుండా చర్యలు తీసుకుంటూ... తనపై ఆంక్షలు విధించిన దేశాలపై రష్యాలో కార్యకలాపాలు నిర్వహణపై ఆంక్షలు విధిస్తోంది.
ఎలాగైనా రష్యాకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్న పలు దేశాలు ఆ దేశంపై మరింత కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ప్రపంచంలో రష్యాను ఒంటరిని చేయాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాతో పాటు నాటో కూటమి దేశాలు, పశ్చిమ దేశాలు రష్యాపై ఇప్పటికే పలు ఆంక్షలు విధించాయి. తాజాగా ఆస్ట్రేలియా.. రష్యా తీరును ఖండిస్తూ.. ఆంక్షలు విధిస్తోంది. ఆస్ట్రేలియాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న రష్యా వ్యాపార వేత్తలు, ఆ దేశంలో వాణిజ్యం నిర్వహిస్తున్న వారిపై కఠినమైన ఆంక్షలు విధిస్తోంది ఆస్ట్రేలియా. ప్రపంచ దేశాల ఆంక్షల ప్రభావం పడకుండా రష్యా సైతం చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నదని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావం ఇప్పుడు ప్రపంచ దేశాలపై పడుతోంది. ఆ క్రమంలోనే ఆ దేశంపై ఆంక్షలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశంగా రష్యా మారింది. రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం ఆపకుండా ఇలాగే ముందుకు సాగితే మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని పలు ప్రపంచ దేశాలు యోచిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా, రష్యా ప్రపంచంలోనే అత్యధికంగా ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశంగా మారిందని న్యూయార్క్‌కు చెందిన ఆంక్షల వాచ్‌లిస్ట్ సైట్ పేర్కొంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు ఉక్రేనియన్ తిరుగుబాటు ప్రాంతాలైన డొనెట్స్క్ మరియు లుహాన్స్క్‌లను స్వతంత్ర రాష్ట్రాలుగా ప్రకటించిన ఒక రోజు తర్వాత ఫిబ్రవరి 22న రష్యాపై US మరియు దాని మిత్రదేశాలు మొదట ఆంక్షలు విధించాయని Castellum.AI తెలిపింది.
