Asianet News TeluguAsianet News Telugu

ఈవిడ టేస్టే డిఫరెంట్... భర్తతో విడాకులు.. కుక్కతో పెళ్లి.. ఎందుకటా అంటే...

లండన్ కు చెందిన అమండా రోడ్జర్స్ (47) తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత  కొంతకాలం  ఒంటరిగానే  జీవితాన్ని గడిపింది. అయితే ఇటీవల అమండా రోడ్జర్స్ కు జీవితం మరీ బోరుగా అనిపించినట్టుంది. 24 గంటలూ తన వెనకే తోక ఊపుకుంటూ తిరిగే.. తన పెంపుడు కుక్క తో ప్రేమలో పడింది. 

uk woman marries pet dog after divorce to her first husband
Author
Hyderabad, First Published Nov 25, 2021, 3:23 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

‘వెర్రి వెయ్యి విధాలు’, ‘జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి’ లాంటి ఎన్నో సామెతలు మీ మదిలో మెదులుతాయి ఈ స్టోరీ చదివితే. అంతేనా అసలు విషయం ఏంటో తెలుసుకుంటే ముక్కు మీద వేలేసుకుని ‘ఎట్టెట్టా..’ అని కూడా బోల్డు ఆశ్యర్యపోతారు. అంతెందుకు.. అస్సలు అదెలా సాధ్యం.. అంటూ నోరెళ్ల బెడతారు. అయినా మన అభిప్రాయాలతో పనేం ఉంది. ఆవిడ తాను అనుకున్నది చేసేసింది. ఇలా అనుకునే మనలాంటి వారికి ఓ ఘాటు రిప్లై కూడా ఇచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే...  

లండన్ లో ఓ విచిత్రమైన పెళ్లి జరిగింది. అది అలాంటిలాంటి విచిత్రమైన పెళ్లి కాదండోయ్... కొన్ని సార్లు మన చుట్టూ జరిగే పరిణామాలను చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. అందులో కొన్నింటిని అయితే నమ్మలేం కూడా... అదిగో అచ్చు అలాంటి ఘటనే తాజాగా Londonలో చోటుచేసుకుంది. 

లండన్ కు చెందిన Amanda Rodgers (47) తన భర్తకు విడాకులు ఇచ్చింది. సంసారమన్నాక ఏదో కలతలు, కలహాలు మామూలే కదా. ఆ గొడవలు ముదిరి విడాకులకు దారి తీసినట్టున్నాయి. ఆ తర్వాత  కొంతకాలం  ఒంటరిగానే  జీవితాన్ని గడిపింది. అయితే ఇటీవల అమండా రోడ్జర్స్ కు జీవితం మరీ బోరుగా అనిపించినట్టుంది. 24 గంటలూ తన వెనకే తోక ఊపుకుంటూ తిరిగే.. తన pet dog తో ప్రేమలో పడింది.  ఆ కుక్క పేరు షెబా. అమండా ఆ కుక్కకు రెండు నెలల వయసున్నప్పటినుంచి పెంచుతోంది.

స్వీడన్ తొలి మహిళా ప్రధానిగా మగ్దలీనా అండర్సన్.. పదవి చేపట్టిన గంటల్లోనే రాజీనామా.. !!

అప్పటి నుంచి Sheba తనపై ఎంతో ప్రేమని చూపిస్తోందని తెలిపింది. అందుకే మనుషులు చూపించే ప్రేమ కంటే తను షెబాలోనే నిజమైన ప్రేమను చూశానని చెప్పుకొచ్చింది. అందుకే దాన్ని భాగస్వామిగా ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అంటోంది అమండా రోడ్జర్స్. దీనికోసం షెబా పర్మీషన్ కూడా తీసుకుందట.. అందుకు తాను మోకాళ్లపై నిలబడి షెబాకు ప్రపోజ్ చేయగా అది తోక ఊపి తన అంగీకారం తెలిపినట్లు చెప్పింది.

ఆ తర్వాత అమండా రోడ్జర్స్  తన పెంపుడు కుక్క షెబాను  200 మంది బంధువుల సమక్షంలో marriage చేసుకుంది. అమండా రోడ్జర్స్  ఇప్పటివరకు షెబాతో  సంతోషంగా ఉన్నట్లు తెలిపింది.  ఆమె చుట్టుపక్కల వారికి అమండా, షెబా  మధ్య ప్రేమ వింతగా అనిపించినా.. అమండా రోడ్జర్స్  అవేమీ పట్టించుకోకుండా జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నట్లు తెలపడంతో అటువంటి వారికి మైండ్ బ్లాక్ అయ్యేలా సమాధానం చెప్పింది.

ఈ వింత పెళ్లి గురించి తెలుసుకున్న స్థానిక మీడియా ఆమెను ఇంటర్వ్యూ చేయగా.. సంతోషంగా తన పెళ్లి గురించి చెప్పుకొచ్చింది. పాపం ఈ ప్రేమ గోల, పెళ్లి గోల గురించి ఏ మాత్రం అవగాహన లేని ఆ బుజ్జికుక్క మాత్రం తనకేం తెలియదన్నట్టు చూస్తూ.. అమండా ఒళ్లో ఒదిగి పోవడం కొసమెరుపు. 

Follow Us:
Download App:
  • android
  • ios