సోషల్ మీడియా ప్లాట్ ఫారం ట్విట్టర్ కి, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి మధ్య ఒక మినీ సైజు యుద్ధమే జరుగుతుంది. ట్రంప్ చేసిన ఒక రెండు ట్వీట్లపై ట్విట్టర్ అభ్యంతరం తెలిపింది. ఆ ట్వీట్లు తప్పుబట్టించే విధంగా ఉన్నాయన్న ఉద్దేశంతో అక్కడ ఒక హెచ్చరికను మార్క్ చేసింది ట్విట్టర్. 

మెయిల్ ఇన్ బాలట్లకు సంబంధించి అవి ఫ్రాడ్ అని అవి రిగ్గింగ్ కు గురయ్యే ఆస్కారం ఉందని పేర్కొంటూ ట్రంప్ ట్వీట్ చేసాడు. ఇలా మెయిల్ ఇన్ బాలట్లకు సంబంధించి ట్రంప్ చేసిన ట్వీట్లు ప్రజలను తప్పుదోవ పట్టించేవిధంగా ఉన్నాయని భావించిన ట్విట్టర్ వాటిపై ఒక ట్యాగ్ ను ఏర్పాటు చేసింది. 

ఇలా ట్విట్టర్ వాటిని తప్పుదోవ పట్టించే ఆస్కారం ఉన్నవి అని మార్క్ చేయడంతో ట్రంప్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. ట్విట్టర్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వేలుపెడుతుందని ఇది పూర్తిగా అనైతికమని అన్నారు ట్రంప్. 

మెయిల్ ఇన్ బాలట్లకు సంబంధించి అవి ఫ్రాడ్ అని తాను అన్న మాటలను ఫేక్ న్యూస్ రాసే  సిఎన్ఎన్ లతో ఫాక్ట్ చెకింగ్ చేపించి వాటిని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని అనడం పూర్తిగా సహించరానిదని, ఇది వాక్ స్వాతంత్య్రాన్నీ పూర్తిగా హరించివేయడమే అని, అమెరికా అధ్యక్షుడిగా తాను దీన్ని సహించబోనని అన్నాడు.