అమెరికా అధ్యక్ష ఎన్నికలు  అమెరికాలో రాజకీయ వేడి రోజురోజుకి  అధ్యక్ష ఎన్నికలను ఎలాగైనా గెలవాలని ట్రంప్ రోజుకో ఎత్తుగడ వేస్తున్నారు. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ హత్యానంతరం అక్కడ నిరసనలు వెల్లువెత్తుతునన్ విషయం తెలిసిందే. 

ట్రంప్ వ్యతిరేకవర్గానికి చెందిన ఒక వ్యక్తి ట్రంప్ మద్దతుదారుతో ఘర్షణకు దిగిన ఒక సందర్భంలో ట్రంప్ అనుకూల వర్గం వ్యక్తి  వైట్ పవర్ అని నినాదాలు చేసారు. ఈ నినాదాలు కలిగిన ఒక వీడియోను ట్రంప్ పోస్ట్ చేసాడు. కానీ ప్రజల నుండి వ్యతిరేకత ఎదురవడంతో... ఆయన దాన్ని తొలగించాడు. 

గ్రామాల్లోని ప్రజలకు నా ధన్యవాదాలు అంటూ శ్వేతజాతీయులకు ధన్యవాదాలు అన్న క్యాప్షన్ తో ఈ విడెను పోస్ట్ చేసాడు. ఈ వీడియోలో ట్రంప్ మద్దతుదారు ఒక గోల్ఫ్ కార్ట్ లో వెళుతూ వైట్ పవర్ అని పిడికిలి ఎత్తి నినదించడం మనం వినొచ్చు. 

ట్రంప్ కి మద్దతుగా అతడు బండి పై స్టైక్కెర్లు అంటించాడు. దీనితో రోడ్డుపక్కనున్న నిరసనకారుడు రేసిస్ట్ అంటూ అరిచాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో.... ట్రంప్ మద్దతుదారు వైట్ పవర్ వైట్ పవర్ అని నినదించడం మొదలుపెట్టాడు. 

ఉదయం 7.30 కు  ట్రంప్ ఈ వీడియోను ట్వీట్ చేసాడు. కానీ విపరీతమైన వ్యతిరేకత రావడంతో దీనిని తొలిగించినట్టున్నాడు. 11.30 తరువాత ఆ వీడియో లేదు. ఎప్పటినుండో ట్రంప్  ప్రభుత్వం జాతివివక్షను పెంచి పోషిస్తుందని ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.