Asianet News TeluguAsianet News Telugu

పెళ్లిని వాయిదా వేసుకొన్న డెన్మార్క్ ప్రధాని: మూడోసారి పోస్ట్‌పోన్

డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్టె ఫ్రెడెరక్సిన్ తన పెళ్లిని వాయిదా వేసుకొన్నారు. ఇలా పెళ్లిని వాయిదా వేసుకోవడం ఆమెకు ఇది మూడో సారి. ప్రస్తుతం ఈయూ సమ్మిట్ కారణంగా తన పెళ్లిని వాయిదా వేసుకొన్నట్టుగా ఆమె గురువారం నాడు మీడియాకు తెలిపారు.

To Protect Denmark's Interest": Danish PM Postpones Wedding Third Time
Author
Denmark, First Published Jun 26, 2020, 10:46 AM IST

డెన్మార్క్: డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్టె ఫ్రెడెరక్సిన్ తన పెళ్లిని వాయిదా వేసుకొన్నారు. ఇలా పెళ్లిని వాయిదా వేసుకోవడం ఆమెకు ఇది మూడో సారి. ప్రస్తుతం ఈయూ సమ్మిట్ కారణంగా తన పెళ్లిని వాయిదా వేసుకొన్నట్టుగా ఆమె గురువారం నాడు మీడియాకు తెలిపారు.

తాను అద్భుతమైన వ్యక్తిని పెళ్లి చేసుకొనేందుకు సిద్దంగా ఉన్నట్టుగా  ఆమె తన ఫేస్‌బుక్ పోస్టులో ప్రకటించారు. తనకు కాబోయే భర్త ఫోటోను కూడ ఆమె షేర్ చేశారు.

ఈ ఏడాది జూలై మాసంలో తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నాను. కానీ అదే రోజున బ్రస్సెల్స్ లో సమావేశం ఉంది. ఈ సమావేశానికి కచ్చితంగా హాజరుకావాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు.

ముందు నా పనిని నేను చేయాలి, అంతేకాదు డెన్మార్క్ ప్రజల ఇంట్రెస్టులను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో పెళ్లి చేసుకొనే తేదీని మార్చుకోవాలని భావిస్తున్నామని ఆమె తెలిపారు.త్వరలోనే మేం పెళ్లి చేసుకోవాలి, తన కాబోయే భర్త బో కు పెళ్లికి తాను సిద్దంగా ఉన్నానని చెప్పడానికి ఎదురు చూస్తున్నట్టుగా ఆమె చెప్పారు.

ఈ ఏడాది జూలై 17, 18 తేదీల్లో యూరోపియన్ ఎక్స్‌ట్రార్డినరి కౌన్సిల్ సమావేశాలు బ్రస్సెల్స్ లో జరగనున్నాయి. వీడియో కాన్పరెన్స్ ద్వారా సమావేశాలు జరుగుతాయి. గత వారమే ఈ సమావేశాల నిర్వహణ గురించి నిర్ణయం తీసుకొన్నారు.

కరోనా లాక్ డౌన్ తర్వాత జరిగే తొలి సమావేశం ఇదే.కరోనా నేపథ్యంలో ఈయూ బడ్జెట్ పై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios