ట్విట్టర్ లో బ్లూ టిక్ ఇక ఉచితం కాదు. దాని కోసం నెలకు 8 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. మన భారతీయ కరెన్సీలో చెప్పాలంటే దాదాపుగా రూ.660 చెల్లించాలి. ఈ విషయాన్ని ట్విట్టర్ కొత్త సీఈవో ఎలాన్ మస్క్ మంగళవారం ప్రకటించారు. 

మైక్రోబ్లాగింగ్ సైట్‌ ట్విట్టర్ లో బ్లూ టిక్ పొందడానికి, ఇప్పటికే ఉన్నదానిని నిలుపుకోవడానికి నెలకు సుమారు 8 డాలర్లు ( ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 660) చెల్లించాల్సి ఉంటుందని ఆ సంస్థ కొత్త సీఈవో ఎలాన్ మస్క్ మంగళవారం ప్రకటించారు. కొనుగోలు శక్తి సమానత్వానికి, దేశానికి అనుగుణంగా ధర సర్దుబాటు చేశామని ఆయన తెలిపారు.

క్లిష్ట సమయంలో భారతీయులకు అండగా ఉంటాం.. కేబుల్ బ్రిడ్జి ఘటనపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు

స్పామ్, స్కామ్‌ను ఓడించడానికి అవసరమైన ప్రత్యుత్తరాలు, ప్రస్తావనలు, శోధనలో కూడా ట్విట్టర్ బ్లూ టిక్ వినియోగదారులు ప్రాధాన్యత పొందుతారని మస్క్ ప్రకటించారు. అలాగే వారు పెద్ద వీడియోను, ఆడియోను కూడా కూడా పోస్ట్ చేయవచ్చని తెలిపారు. ‘‘మాతో కలిసి పనిచేయడానికి ఇష్టపడే ప్రచురణకర్తల కోసం పేవాల్ బైపాస్’’ఉంటుందని ఆయన అన్నారు.

Scroll to load tweet…

కాగా.. బ్లూ టిక్ వెరిఫై కోసం ఎంత చెల్లించవచ్చని ఎలాన్ మస్క్‌తో కలిసి పనిచేస్తున్న ఒక వెంచర్ క్యాపిటలిస్ట్ ఒక పోల్‌ను ట్వీట్ చేశారు. వినియోగదారులు ఎంత వరకు చెల్లించడానికి సిద్దంగా ఉన్నారని అందులో పేర్కొన్నారు. దీంతో ఇక బ్లూ టిక్ కు డబ్బులు చెల్లించాల్సిందేనని విషయంలో ఒక్క సారిగా వెలుగులోకి వచ్చింది. ఈ పోల్ కు ఎలాన్ మాస్క్ ‘ఇంట్రెస్టింగ్’ అని బదులిచ్చారు.

మోర్బీ బ్రిడ్జీ ఘటనతో అప్రమత్తమైన పశ్చిమ బెంగాల్.. 2,109 వంతెనల ఫిట్ నెస్ ను పరీక్షించాలని మమతా సర్కార్ ప్లాన్

ఇదిలా ఉండగా.. చాలా కాలంగా ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపార నాయకులు, జర్నలిస్టులకు ఎలైట్ హోదా చిహ్నంగా ఇస్తారు. అయితే చాలాకాలంగా విమర్శకులు ఈ గుర్తును ఎగతాళి చేశారు. కానీ ట్విట్టర్ కూడా అకస్మాత్తుగా వార్తల్లోకి వచ్చే కార్యకర్తలు, వ్యక్తులను ధృవీకరించడానికి బ్లూ చెక్ మార్క్‌ను ఉపయోగిస్తోంది. దీని వల్ల తమను తాము జర్నలిస్టులు, ఇతర వ్యక్తుల మాదిరిగా నటిస్తూ వారి నుంచి వచ్చే తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి దీనిని అదనపు సాధనంగా ఉపయోగిస్తున్నారు. కాగా.. గత ఆదివారం ఎలాన్ మాస్క్ ఈ బ్లా టిక్ వ్యవహారంపై ఓ ట్వీట్ చేశారు. మొత్తం వెరిఫికేషన్ ప్రక్రియ ప్రస్తుతం పునరుద్ధరించబడుతోంది అని అందులో పేర్కొన్నారు.