ఇప్పుడు ప్రపంచమంతా  టిక్ టాక్ మాయమైపోయింది.  ఏడుపోచ్చిన, నవ్వోచ్చిన సరే ప్రతి భావోద్వేగాన్ని పంచుకోవడానికి అదే వేదిక అవుతుంది.  అన్ని వీడియో స్ట్రీమింగ్‌లా కన్నా టిక్ టాక్‌కు ఉన్న అదరణ అంత ఇంత కాదు.  

ఇప్పుడు ప్రపంచమంతా టిక్ టాక్ మాయమైపోయింది. ఏడుపోచ్చిన, నవ్వోచ్చిన సరే ప్రతి భావోద్వేగాన్ని పంచుకోవడానికి అదే వేదిక అవుతుంది.
అన్ని వీడియో స్ట్రీమింగ్‌లా కన్నా టిక్ టాక్‌కు ఉన్న అదరణ అంత ఇంత కాదు. ఔత్సాహికులలో ఉన్న ప్రతిభకు వెలికితీయడంలో ఈ మాధ్యమం ఉపయోగం ఎంతో. అయితే దాని వల్ల ఎన్ని ప్లెస్ పాయింట్స్ ఉన్నయో నెగిటివ్స్ కూడా అంత గానే ఉన్నాయి. 

 నేరాలు జరగడంలో టిక్ టాక్ పాత్ర ఎక్కువగానే ఉంటుంది. వాటిలోని వీడియోలో సందేశాలు గొడవలకు హత్యలకు దారి తీస్తుండడంతో ఆందోళన కలిగిస్తోంది. ఈ సోషల్ మీడియా యాప్ టిక్ టాక్‌ కుటుంబాలను విచ్చిన్నం చేస్తుంది.

తాజాగా చైనాలో ఓ యువతి చేసిన టిక్‌టాక్‌ వీడియో ఆ దేశంలో ప్రకంపనల్ని సృష్టిస్తోంది. అంతలా ఆ యువతి ఏం చేసింది అంటారా!. ఫెరోరా అజీజ్‌ అనే యువతి మేకప్‌ వీడియో పేరుతో టిక్ టాక్‌లో ఓ వీడియో చేసింది. కానీ వీడియోలో ఆ యువతి తన అసలు ఉద్దేశాన్ని బయటపెట్టింది. 

Scroll to load tweet…

చైనాలో నిర్భంధ శిబిరాల్లో నలిగిపోతున్న ముస్లింలా వ్యధాభరిత జీవితాలను చేప్తూ ఆవేదన వ్యక్తం చేసింది. వారు అనుభవిస్తున్న అనుభవిస్తున్నా నరకయాతనపై ఆక్రోశాన్ని వెళ్లగక్కింది.

ఈ వీడియో చైనాలో ప్రకంపనలు సృష్టించింది. ఇది విపరీతంగా వైరల్ అవ్వడంతో టిక్‌టాక్‌ యాజమాన్యం ఆమె అకౌంట్‌ను నిలిపివేసింది.అయినప్పటి ఆ వీడియోను అనేకమంది యూజర్లు తిరిగి పోస్ట్‌ చేశారు. అయితే వివాదంపై ఫెరోరా ట్విటర్‌లో స్పందించారు. అకౌంట్‌ను బ్లాక్‌ చేయడం ద్వారా ప్రశ్నించే గొంతును ఆపలేరు. 

ముస్లింలపై జరుగుతున్న దారుణాలను ప్రతి క్షణం ప్రశ్నిస్తునే ఉంటాను. ఫెరోరా అకౌంట్ నిలుపుదలపై టిక్ టాక్ ప్రతినిధులు కూడా స్పందించారు. ఆమె మరో అకౌంట్ ద్వారా ఉగ్రవాది బిన్ లాడెన్ ఫోటోను షేర్ చేసింది. ఓ అసాంఘిక శక్తికి చెందిన సమాచారాన్ని వ్యాప్తి చేయడాన్ని మా సంస్ధ ఎట్టి పరిస్థితిలో సహించేబోయోది లేదు. 

అందువల్ల ఆమె అకౌంట్‌ను నిలిపివేసినట్లు స్పష్టం చేశారు.అకౌంట్‌ను బ్లాక్‌ చేయడంపై కంపెనీ ప్రతినిధిల ఇచ్చిన వివరణపై ఫెరోరా ఖండించింది, చైనా ప్రభుత్వం ప్రోద్బలంతోనే వారు చేసరంటూ పేర్కొంది.