Asianet News TeluguAsianet News Telugu

బీచ్ లో ముగ్గురు మహిళల దారుణ హత్య, చిత్రహింసలు పెట్టి, మట్టిలో పూడ్చి.. చివరి మెసేజ్ లో షాకింగ్ విషయాలు....

సరదాగా ఈక్వెడార్ కు వెళ్లిన ముగ్గురు మహిళలు దారుణంగా హత్యకు గురయ్యారు. వారిని చిత్రహింసలు పెట్టి, ఇసుకలో పాతిపెట్టారు. 

Three Women Were Brutally Murdered In a Beach in USA - bsb
Author
First Published Apr 18, 2023, 12:41 PM IST

ఈక్వెడార్‌ : ఈక్వెడార్ లో ఓ ముగ్గురు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. వీరి మృతదేహాలు అత్యంత భయంకరమైన స్థితిలో పోలీసులకు దొరికాయి. వీరిని చిత్రహింసలకు గురిచేసి చంపేసిన దుండగులు బీచ్ ఒడ్డున పాతిపెట్టి వెళ్లిపోయారు. కాగా,  బీచ్ ట్రిప్‌లో దారుణ హత్యకు గురైన మహిళలు తమ సన్నిహితులకు పంపిన హాంటింగ్ టెక్స్ట్ మెసేజ్ లు కలకలం రేపుతున్నాయి. 

ఏప్రిల్ 4న ఈ ముగ్గురు మహిళలు కనిపించకుండా పోయారు. ఆ తరువాత మూడు రోజులకు డెనిస్ రేనా, 19, యులియానా మాసియాస్, 21, నయేలీ తపియా, 22లు మృతదేహాలు బీచ్ లో దొరికారు. వారి గొంతులు కోసి.. ఎక్కువ లోతులేని సమాధిలో ఖననం చేయబడినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. ఈ ముగ్గురిలో మాసియాస్ గాయకురాలు, తపియా ఓ చిన్నారికి తల్లి, రేనా వ్యవసాయ ఇంజనీరింగ్ విద్యార్థిని.

ఫిమేల్ బ్రూస్ లీ : రెస్టారెంట్లో చేయిపట్టుకున్న కస్టమర్ ను రఫ్షాడించిన వెయిట్రెస్.. వీడియో వైరల్..

ఈ ముగ్గురిలో ఇద్దరు మహిళలు తాము ప్రమాదంలో ఉన్నామని సన్నిహితులకు మెసేజ్ లు పంపారు. దీని ప్రకారం "ఏదో జరగబోతోందని అనిపిస్తుంది" అని ఒక మెసేజ్ సారాంశంగా ఉంది. స్థానిక నివేదికల ప్రకారం, ఏప్రిల్ 5న మహిళలను చిత్రహింసలకు గురిచేసి, చంపి, పాతిపెట్టినట్లు అనుమానిస్తున్నారు. 

ఈక్వెడార్‌లోని క్వినిండే సమీపంలోని ఎస్మెరాల్డాస్ నది దగ్గర ఓ కుక్క భూమిని తవ్వుతూ అనుమానాస్పదంగా కనిపించడంతో.. గమనించిన మత్స్యకారుల బృందం వెళ్లి చూడగా.. దుర్వాసన్ రావడంతో ఈ భయంకరమైన వాస్తవం వెలుగు చూసింది. దీంతో వారు వెంటనే పోలీసులను అప్రమత్తం చేశారు. వారు వచ్చి అక్కడ తవ్వి చూడగా ముగ్గురి మృతదేహాలు బయటపడ్డాయి.

బాధితురాలు తపియా తన సోదరికి తన కరెంట్ లొకేషన్ ను వాట్సాప్ లో పంపింది. ఏప్రిల్ 4 రాత్రి 11:10 గంటలకు ఆ లొకేషన్ పంపుతూ.. "ఒకవేళ ఏదైనా జరిగితే..మేమెక్కడున్నామో తెలుస్తుందని ఇది పంపుతున్నాను’ అంతే.. అని వ్రాసినట్లు ఈక్వెడార్ వార్తా సంస్థ విస్టాజో నివేదించింది.

వాళ్లు కనిపించకుండా పోయిన తరువాత ఈ లొకేషన్ సమీపంలోనే శవాలుగా కనిపించారు. రేనా కూడా తప్పిపోవడానికి కొన్ని గంటల ముందు, ఆమె స్నేహితుడికి మెసేజ్ చేసి, "ఏదో జరగబోతోందని అనిపిస్తుంది. ఒకవేళ నాకు అనుకోనిది ఏదైనా జరిగితే, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నానని గుర్తుంచుకో" అని మెసేజ్ లో రాసింది.

మహిళలను కట్టేసి, నోరు మూసేసి.. భయంకరంగా హింసించినట్లుగా మృతదేహాలను బట్టి తెలుస్తోంది. వారిని అక్కడే బీచ్ లో పాతిపెట్టినట్లు గుర్తించారు. "వీరంతా యంగ్ గర్ల్స్, వారి ఒంటిమీద బీచ్ బట్టలు, బాతింగ్ సూట్లు, తేలికపాటి దుస్తులు, షార్ట్‌లు ఉన్నాయి" అని క్వినిండే పోలీసులకు చెందిన డియెగో వెలాస్టేగుయ్ స్థానిక మీడియాకు తెలిపారు. అక్కడినుంచి పోలీసులు ఒక మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. హంతకుడు లేదా హంతకుల కోసం అధికారుల దర్యాప్తుకు ఈ ఫోన్  సహాయపడుతుందని ఆశిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios