తనకు బొంత ఇచ్చే సుఖం.. ఏ మగాడు ఇవ్వలేడు అంటోంది ఓ మహిళ. అందుకే తాను ఈ బొంతనే పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది ఓ మహిళ. ఈ సంఘటన ఇంగ్లాండ్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్ లోని ఎక్సెటర్ కు చెందిన 49ఏళ్ల పస్కేల్ సెల్లిక్ అనే మహిళ త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. పెళ్లి చేసుకోవడంలో వింతేమీ లేదు కానీ.. ఆమె ఎవరిని చేసుకుంటుందనేది ఇక్కడ వింతే. రోజు రాత్రి తాను పడుకునే ముందు కప్పుకునే బొంతతో ఆమె ప్రేమలో పడిందట.  అందుకే దాన్ని పెళ్లి చేసుకుంటానని చెబుతోంది. పెళ్లికి రావాలంటూ అందరినీ ఆహ్వానిస్తోంది కూడా.

ఈ బొంత ఇచ్చే సుఖం తనకు ఇంకెవ్వరూ ఇవ్వలేరని చెబుతోంది. దాన్ని ముట్టుకుంటే తనకు ఎంతో రొమాంటిక్ గా ఉంటుందట. తన ఏకాంతాన్ని దూరం చేస్తుందని ఆమె తెలిపింది. పెళ్లి రోజున తాను స్లిప్పర్, నైట్ గౌన్ వేసుకుంటానని చెబుతోంది.  ఫిబ్రవరి 10వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు తాను బొంతను పెళ్లి చేసుకుంటున్నానని.. తన పెళ్లికి అందరూ ఆహ్వానితులే అని చెబుతోంది.  ప్రస్తుతం ఈమె పెళ్లి విశేషాలు నెట్టింట వైరల్ గా మారాయి.