Asianet News TeluguAsianet News Telugu

కరోనా సమయంలో.. ఆ దేశం మాత్రమే సురక్షితం..!

కొన్ని దేశాలు ఆ పరిస్థితిని దాటేస్తుండగా.. కొన్ని దేశాలు మాత్రం భయంతో వణికి పోతున్నాయి. ఇలాంటి సమయంలో... అసలు ఈ కరోనా వేళ.. ప్రపంచంలోని ఏ దేశం సురక్షితం అనే తేల్చే పనిలో పడ్డారు నిపుణులు.

The Covid Resilience Ranking The Best and Worst Places to Be as Variants Outrace Vaccinations
Author
Hyderabad, First Published Apr 30, 2021, 8:18 AM IST

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేస్తోంది. భారత్ లో పరిస్థితి అతి దారుణంగా ఉంది. ప్రతిరోజూ కొన్ని లక్షల కేసులు నమోదౌతున్నాయి.  కొన్ని దేశాలు ఆ పరిస్థితిని దాటేస్తుండగా.. కొన్ని దేశాలు మాత్రం భయంతో వణికి పోతున్నాయి. ఇలాంటి సమయంలో... అసలు ఈ కరోనా వేళ.. ప్రపంచంలోని ఏ దేశం సురక్షితం అనే తేల్చే పనిలో పడ్డారు నిపుణులు. ఈ విషయంపై ఇటీవల చేసిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

క్లిష్ట పరిస్థితుల్లో ఏ దేశంలో ప్రజలు ఇతర దేశాలతో పోల్చుకుంటే కొంచెం ధైర్యంగా ఉన్నారు? ఈ కరోనా టైంలో ఏ దేశంలో జీవనం సులభంగా ఉంది? అని బ్లూమ్‌బర్గ్ సంస్థ సర్వే చేసింది. ఇంతకుముందు చేసిన ఈ సర్వేలో తొలిస్థానంలో న్యూజిల్యాండ్ ఉంది. అక్కడ కరోనాను నియంత్రించిన తీరుతో ఆ దేశానికి అగ్రస్థానం దక్కింది. అయితే ఈ ఏప్రిల్‌లో ఆ దేశాన్ని సింగపూర్ దాటేసింది.

వైరస్ వ్యాప్తిని నియంత్రించడం, వ్యాక్సినేషన్ ద్వారా సింగపూర్ కరోనాను చాలావరకు నిలువరించింది. ఆసియా మొత్తంలో అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ జరిగిన దేశాల్లో ఇది ఒకటి. అందుకే ఈ ద్వీపదేశానికి తొలిస్థానం అందించింది బ్లూమ్‌బర్గ్. ఆ తర్వాతి స్థానంలో వరుసగా న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, తైవాన్, సౌత్ కొరియా, జపాన్, యూఏఈ, ఫిన్‌ల్యాండ్, హాంగ్‌కాంగ్ ఉన్నాయి. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో ఈ జాబితాలో పదిస్థానాలు దిగజారి 30వ స్థానానికి పడిపోయింది మనదేశం.
 

Follow Us:
Download App:
  • android
  • ios