కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేసింది. లాక్ డౌన్ తో  మొత్తం మారిపోయింది. అప్పటి వరకు ప్రశాంతంగా సాగిన జీవితాలు తల్లకిందులయ్యాయి. చాలా మందికి పని లేకుండా పోయింది.చేద్దామని అనుకున్నా కూడా కనీసం వాళ్లకి పని దొరకడం లేదు. 

వీళ్ల జాబితాలో చెఫ్స్ కూడా ఉన్నారు. దీంతో.. వాళ్లంతా మాకు పనిఇవ్వండి అంటూ వేడుకుంటున్నారు. అయినా ఎవరూ పట్టంచుకోకపోవడంతో. నగ్నంగా నిరసనలు చేపడుతున్నారు. ఈ సంఘడటన రష్యాలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 రష్యాలో వందలాదిమంది మగవాళ్లు, ఆడవాళ్లు ఒంటి మీది బట్టలన్నింటినీ తొలగించుకుని ఆ గ్రూప్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. వ్యూయర్స్‌కి వాళ్లు చేస్తున్న మేలు ఏమిటంటే.. కంప్లీట్‌ దిగంబరంగా కాకుండా ప్లేట్లు, కప్పులు, సాస్‌ ప్యాన్‌లు, బాటిల్స్, స్టూళ్లు అడ్డుగా పెట్టుకుంటున్నారు. 

వాళ్లంతా రష్యాలోని బార్లు, రెస్టారెంట్‌లు, కేఫ్‌లలో పని చేసే షెఫ్‌లు, కొందరైతే ఓనర్లు కూడా! లాక్‌డౌన్‌ తో పనులు లేకుండా పోవడంతో వాళ్లిలా తమ అభాగ్యతను ప్రదర్శిస్తున్నారు. ‘‘మేము ఒకటే కోరుతున్నాం. పని కల్పించండి’’ అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఏమీ లేని మనుషులుగా మిగిలామని చెప్పడానికే అలా నూలు పోగు లేకుండా నిరసన వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు.