Asianet News TeluguAsianet News Telugu

మతిమరుపు...రోడ్ ట్రిప్ లో భార్యను మధ్యలో వదిలేసిన భర్త...!

ఆ ట్రిప్ మధ్యలో ఆమెకు వాష్ రూమ్ వెళ్లాల్సి వచ్చింది. తెల్లవారు జామున మూడు గంటల సమయంలో ఆమె బాత్రూమ్ కి వెళ్లడానికి భర్త రోడ్డు పక్కన కారు పార్క్ చేశాడు. 

Thailand Man Forgets Wife After Toilet Break During Road Trip
Author
First Published Dec 29, 2022, 11:35 AM IST

మతిమరుపు ఉన్నవారిని చూసే ఉంటారు. అలాంటి ఓ వ్యక్తి కథే ఇది. మతమరుపుతో చేయాల్సిన పనులు మర్చిపోయేవారు ఉంటారు.కానీ ఓ వ్యక్తి ఏకంగా తన భార్యను మర్చిపోయాడు. రోడ్ ట్రిప్ కి వెళ్తుంటే... మధ్యలోనే భార్యను వదిలేసి మర్చిపోయి వచ్చేశాడు. ఫలితంగా అతని భార్య దాదాపు 20 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. ఈ సంఘటన థాయిలాండ్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం... థాయిలాండ్ కి చెందిన బూన్‌టమ్ చైమూన్(55), అతని భార్య అమ్నుయే చైమూన్ (49) మహా సరాఖం ప్రావిన్స్‌లోని తన స్వగ్రామంలో సెలవులను గడపడానికి ఆదివారం రోడ్ ట్రిప్ కి వెళ్లారు. ఇద్దరూ సరదాగా గడపాలని అనుకున్నారు. ఆ ట్రిప్ మధ్యలో ఆమెకు వాష్ రూమ్ వెళ్లాల్సి వచ్చింది. తెల్లవారు జామున మూడు గంటల సమయంలో ఆమె బాత్రూమ్ కి వెళ్లడానికి భర్త రోడ్డు పక్కన కారు పార్క్ చేశాడు.   


ఇంతలో, చుట్టూ పబ్లిక్ టాయిలెట్లు లేకపోవడంతో, మహిళ కూడా కారు దిగి, మూత్ర విసర్జన చేయడానికి సమీపంలోని అడవిలోకి వెళ్లింది. అయితే ఆమె వాహనం దిగడం ఆ వ్యక్తి గమనించలేదు. తిరిగి వచ్చేసరికి కారు, భర్త కనిపించలేదు. తన భర్త తాను లేకుండా వెళ్లిపోయాడని, ఆమెను ఒంటరిగా వదిలివేసినట్లు ఆమె వెంటనే గ్రహించింది. పైగా.. ఆమె ఫోన్ కూడా కారులోనే ఉండటం గమనార్హం. చీకటిగా ఉన్నందున, ఆ మహిళ చాలా భయపడి. గందరగోళానికి గురైంది. ఫోన్ కూడా దగ్గర లేకపోవడంతో.. చేసేది లేక ఆమె నడవడం ప్రారంభించింది.

ఆమె దాదాపు 20 కి.మీ (సుమారు 12.4 మైళ్లు) నడిచి, ఉదయం 5 గంటలకు కబిన్ బురి జిల్లాకు చేరుకుంది. అక్కడ పోలీసులను ఆశ్రయించి.. భర్తకు ఫోన్ చేయాలని అనుకుంది. భర్త నెంబర్ ఆమెకు పెద్దగా గుర్తులేదు. తన ఫోన్ కి దాదాపు 20 సార్లు ఫోన్ చేసింది. అయినా అతను లిఫ్ట్ చేయకపోవడం గమనార్హం. 

ఉదయం 8 గంటల ప్రాంతంలో పోలీసుల సహాయంతో ఆమె తన భర్తను సంప్రదించగలిగింది. అప్పటి వరకు తన భార్య కారులో లేదనే విషయం అతనికి తెలియకపోవడం గమనార్హం. ఆమె వెనుక సీటులో గాఢనిద్రలో ఉందనే భావనలో ఉన్నాడు. ఆ సమయానికి, అతను 159.6 కి.మీ (100 మైళ్ళు) దూరంలో ఉన్న కోరాట్ ప్రావిన్స్‌కు వెళ్లడం గమనార్హం.

ఆ తర్వాత అతను మళ్లీ వెనక్కి వెళ్లి.. భార్యను చేరుకోగలిగాడు. తన భార్య వాష్ రూమ్ కారు కిందకు దిగింది అనే విషయం మర్చిపోవడం వల్లే ఇలా జరిగిందని అతను తర్వాత చాలా బాధ పడటం గమనార్హం. తన భార్య దగ్గరకు వెళ్లగానే వెంటనే క్షమాపణలు కూడా చెప్పేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios