Asianet News TeluguAsianet News Telugu

మాస్కు పెట్టుకోలేదని.. ఏకంగా ప్రధానికే ఫైన్... !

అధికారులతో సమావేశం సందర్భంగా మాస్కు ధరించనందుకు గానూ.. థాయ్ లాండ్ ప్రధానమంత్రి జనరల్ ప్రయూత్ చాన్-వో-చాకు అధికారులు 6వేల భాట్ల సుమారు రూ.14,270 జరిమానా విధించారు. 

thai prime minister fined $190 for not wearing face mask - bsb
Author
Hyderabad, First Published Apr 27, 2021, 10:48 AM IST

అధికారులతో సమావేశం సందర్భంగా మాస్కు ధరించనందుకు గానూ.. థాయ్ లాండ్ ప్రధానమంత్రి జనరల్ ప్రయూత్ చాన్-వో-చాకు అధికారులు 6వేల భాట్ల సుమారు రూ.14,270 జరిమానా విధించారు. 

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా థాయ్ సర్కారు కఠిన చర్యలు తీసుకుంటుంది. భారత్ నుంచి థాయ్ ప్రజలు మినహా మరెవరూ తమ దేశం రావద్దని ఆంక్షలు విధించింది. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.

ఇక బ్యాంకాక్ మెట్రోపలిటన్ ఆడ్మినిస్ట్రేషన్ నిబంధనల ప్రకారం.. రాజధానిలో ఇల్లు దాటి బయటకు వచ్చే ప్రతి వ్యక్తి మాస్కు ధరించడం తప్పనిసరి. దీన్ని ఉల్లంఘించే వారికి 20,000భాట్ల.. రూ.47, 610 వరకూ జరిమానా విధిస్తారు. 

వ్యాక్సిన్ కొనుగోలు విషయమై ప్రధాని ప్రయూత్ సోమవారం సలహాదారులతో సమావేశమయ్యారు. ఆ సమయంలో ఆయన మాస్కు ధరించలేదు. ఈ విషయంపై తానే అధికారులకు ఫిర్యాదు చేసినట్లు బ్యాంకాక్ గవర్నర్ అశ్విన్ క్వాన్యుముయాంగ్ తన ఫేస్ బుక్ ఖాతాలో వెల్లడించారు.

కాసేపట్లోనే ఇది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ప్రధాని తీరుపై ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో.. ప్రయూత్ కు అధికారులు జరిమానా విధించారు. 
కాగా, థాయ్ లాండ్ పౌరులు మినహా మిగతా వారికి తమ దేశంలో ప్రవేశించేందుకు ఇచ్చే ప్రవేశ ధృవీకరణ పత్రాల మంజూరును మే 1నుంచి రద్దు చేస్తున్నట్లు ఢిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయం ప్రకటించింది. ఇది భారతీయులకూ వర్తిస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios