Asianet News TeluguAsianet News Telugu

సిక్కు గురుద్వారాలో ఉగ్రవాదుల కాల్పులు, 11 మంది మృతి

ప్రపంచమంతా కరోనా మహమ్మారి విలయతాండవంతో అల్లాడుతుంటే ముష్కరులు మాత్రం రక్తపుటేర్లు పారిస్తున్నారు. బుధవారం ఆఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని ఓ సిక్కు గురుద్వారాలో ఉగ్రవాదులు  జరిపిన దాడిలో 11 మంది దుర్మరణం పాలవ్వగా, పలువురు గాయపడ్డారు

Terrorists attack on Sikh gurdwara in Afghanistan
Author
Kabul, First Published Mar 25, 2020, 3:59 PM IST

ప్రపంచమంతా కరోనా మహమ్మారి విలయతాండవంతో అల్లాడుతుంటే ముష్కరులు మాత్రం రక్తపుటేర్లు పారిస్తున్నారు. బుధవారం ఆఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని ఓ సిక్కు గురుద్వారాలో ఉగ్రవాదులు  జరిపిన దాడిలో 11 మంది దుర్మరణం పాలవ్వగా, పలువురు గాయపడ్డారు.

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.45 నిమిషాలకు నగరంలోని షోర్ బజార్‌లోని గురుద్వారాలో ఈ ఘటన జరిగింది. సుమారు 150 మంది సిక్కులు ప్రార్థనలు చేసుకుంటుండగా, ఆయుధాలు, బాంబులు పట్టుకుని లోపలికి ప్రవేశించారు.

Also Read:రష్యాలో భూకంపం: సునామీ హెచ్చరికలు

వచ్చి రాగానే ప్రార్థనలు చేస్తున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న భద్రతా  బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఎదురుకాల్పులకు దిగాయి. సైన్యం కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించగా, లోపలి నుంచి మరో ముగ్గురు ముష్కరులు కాల్పులు జరుపుతున్నారు.

ఇప్పటి వరకు 11 మంది చిన్నారులను గురుద్వారా నుంచి పోలీసులు బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ప్రపంచం మొత్తం కరోనాతో అల్లాడుతున్న సమయంలో ఇలాంటి దాడులు జరపడం క్రూరమైన చర్యగా అభివర్ణించింది.

Also Read:కరోనా ఎఫెక్ట్: క్లినికల్ ట్రయల్స్ ప్రారంబించిన చైనా

అఫ్గాన్‌లోని హిందువులు, సిక్కుల రక్షణకు భారత్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది. కాగా ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్లు ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios