మాలిలో ఉగ్రవాదులు పంజా విసిరారు. సైనిక స్థావరంపై దాడికి పాల్పడి 21 మంది సైనికులను పొట్టనబెట్టుకున్నారు.  మధ్య మాలిలోని ఓ స్థానిక స్థావరం వద్దకు ద్విచక్ర వాహనాలు, కార్లలో వచ్చిన దుండగులు దియౌరాలోని ఆర్మీ క్యాంపుపై కాల్పులకు పాల్పడ్డారు.

ఓ మాజీ సైనికాధికారి నాయకత్వంలో ఏర్పడిన ఉగ్రవాద ముఠానే ఆ దాడికి పాల్పడినట్లు భద్రతా దళాలు భావిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా మాలిలో ఐసిస్ ఉగ్రవాదుల ప్రాబల్యం పెరుగుతూ వస్తోంది.

2012లో ఉగ్రవాదులు దేశ ఉత్తర ప్రాంతంలోని కొంత భాగాన్ని స్వాధీనం చేసుకోగా.. 2013లో ఫ్రెంచ్ సైన్యం వారిని తరిమి కొట్టింది. అనంతరం ఐక్యరాజ్యసమితి అక్కడ శాంతి పరిరక్షక దళాల్ని మోహరించింది. ఫ్రెంచ్ సైన్యం సైతం ఇక్కడ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి.