Asianet News TeluguAsianet News Telugu

ఆఫ్గాన్ లో హెయిర్ స్టైలింగ్. గడ్డం షేవింగ్, ట్రిమ్మింగ్ లపై నిషేధం.. తాలిబన్ల అరాచకం.. !

"ఇస్లామిక్ చట్టాన్ని ఉల్లంఘిస్తుంది" అనే కారణంతో తాలిబాన్లు ఈ ప్రాంతంలోని క్షురకులు మగవారి గడ్డం గీయడం ట్రిమ్మింగ్ చేయడాన్ని నిషేధించారు. ఈ మేరకు ఇస్లామిక్ ఓరియంటేషన్ మంత్రిత్వ శాఖ అధికారులు, ప్రావిన్షియల్ రాజధాని లష్కర్ గాహ్‌లో మెన్స్ హెయిర్ సెలూన్ల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో హెయిర్‌స్టైల్స్, గడ్డంషేవింగ్, ట్రిమ్మింగ్ లను చేయవద్దని సూచించారు.

Taliban ban barbers in Helmand from shaving and trimming beards
Author
Hyderabad, First Published Sep 27, 2021, 11:48 AM IST

కాబూల్ : కొత్తగా అధికారంలోకి వచ్చిన తాలిబాన్ (Taliban) పాలనలో ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan)లో రోజుకో కొత్త రూల్ అమల్లోకి వస్తోంది. తాజాగా హెల్మాండ్ ప్రావిన్స్‌లోని క్షౌరశాలల్లో గడ్డం చేయడం, గడ్డాన్ని ట్రిమ్ చేయకూడదని (shaving and trimming beards)తాలిబన్లు నిషేదాజ్ఞలు (Ban)జారీ చేశారు. ఈ మేరకు మీడియా నివేదికలు వెలువడ్డాయి. "దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌లోని హెల్మాండ్ ప్రావిన్స్‌(Helmand Province)లో తాలిబాన్లు స్టైలిష్ హెయిర్‌స్టైల్స్, గడ్డంషేవింగ్, ట్రిమ్మింగ్ లను నిషేధించారు" అని ఫ్రాంటియర్ పోస్ట్ నివేదించింది.

"ఇస్లామిక్ చట్టాన్ని ఉల్లంఘిస్తుంది" అనే కారణంతో తాలిబాన్లు ఈ ప్రాంతంలోని క్షురకులు మగవారి గడ్డం గీయడం ట్రిమ్మింగ్ చేయడాన్ని నిషేధించారు. ఈ మేరకు ఇస్లామిక్ ఓరియంటేషన్ మంత్రిత్వ శాఖ అధికారులు, ప్రావిన్షియల్ రాజధాని లష్కర్ గాహ్‌లో మెన్స్ హెయిర్ సెలూన్ల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో హెయిర్‌స్టైల్స్, గడ్డంషేవింగ్, ట్రిమ్మింగ్ లను చేయవద్దని సూచించారు.

ఈ ఆదేశాలు సోషల్ నెట్‌వర్క్‌లలో డిస్ట్రిబ్యూట్ చేయబడ్డాయి. హెయిర్ సెలూన్లలో కటింగ్, షేవింగ్ చేసే సమయాల్లో మ్యూజిక్ లేదా హైమన్స్ పెట్టకూడదని.. ఎలాంటి సంగీతాన్నీ ప్లే చేయకూడదనే అభ్యర్థన కూడా ఉందని ది ఫ్రాంటియర్ పోస్ట్ నివేదించింది.

ఆఫ్ఘనిస్తాన్‌లో మీడియాపై తాలిబాన్ ప్రభుత్వం ఉక్కుపాదం.. కచ్చితంగా ఆ 11 నిబంధనలు పాటించాల్సిందే.

ఈ ప్రాంతంలోని ఆఫ్ఘన్ బార్బర్‌లు ఈ నిషేధంవల్ల తమ జీవితాలు కష్టాల్లోకి నెట్టివేయబడ్డాయని అంటున్నారు. కారణం ఏంటంటే.. ఆఫ్ఘన్ పౌరులు తాలిబన్లను ఎదుర్కోవడం, వ్యతిరేకించడం, పోరాటం చేయడం కంటే వారు చెప్పినట్లు సర్దుకుపోవడానికే ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. 

అధికారంలోకి వచ్చిన మొదట్లో చేసిన వాగ్దానాలకు భిన్నంగా.. తాలిబాన్లు నెమ్మదిగా అణచివేత చట్టాలు, తిరోగమన విధానాలను తిరిగి విధించడం ప్రారంభించారు. ఇస్లామిక్ షరియా చట్టం సంస్కరణను అమలు చేసినప్పుడు దాని 1996-2001 నియమాన్ని నిర్వచించే చట్టాలను విధిస్తున్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ లు పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనలు చేస్తున్నారన్న నివేదికలు బహిర్గతం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సంస్థ పశ్చిమ నగరమైన హెరాత్‌లో కిడ్నాప్ చేశారన్న ఆరోపణలతో నలుగురు వ్యక్తులను హత్యచేసి, మృతదేహాలను బహిరంగంగా ప్రదర్శించింది.

అమెరికా, నాటో దళాలు ఆఫ్గన్ నుంచి ఉపసంహరించుకునే క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ దళాలకు వ్యతిరేకంగా దూకుడుగా, వేగంగా ముందడుగు వేసిన తరువాత తాలిబాన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇది జరిగి ఒక నెల రోజులు దాటింది.

గత నెలలో కాబూల్ తాలిబాన్లన చేతిల్లోకి వచ్చింది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రభుత్వం కూలిపోయిన తరువాత దేశం సంక్షోభంలో పడింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios